Rana about NTR Biopic: లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా.. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అనే రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో మాత్రం అలరించలేకపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలకృష్ణ ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పోషించారు. అయితే ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో.. ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్రలో.. రానా దగ్గుబాటి కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు రానా.


"బాహుబలి తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు గారి పాత్రకి నన్ను సంప్రదించారు. అసలు నేను ఎలా ఆ పాత్రకి సెట్ అవుతాను అనుకుని షాక్ అయ్యాను. కానీ ఆ సినిమాకి క్రిష్ కంటే ముందు తేజ గారు డైరెక్టర్. ఆయనే నన్ను సెలెక్ట్ చేశారు. అప్పటికే నేను తేజతో వర్క్ చేశాను కాబట్టి నన్ను సెలెక్ట్ చేశారు.. అలా అని కేవలం ఆ ఒక్క కారణంతోనే నన్ను సెలెక్ట్ చేశారు అని నేను అనుకోలేదు. కరెక్ట్ గానే పాత్రని ఊహించుకొని చేశారు అని అనుకుని ఒకే చెప్పేసాను. తర్వాత సినిమాలో ఆ పాత్ర కోసం చంద్రబాబు గారిని కలిసి వర్క్ షాప్ కూడా చేశాను. అప్పుడు తెలిసింది ఆ పాత్ర కోసం నేను చాలా ధైర్యం చేయాలి అని. అందుకే అప్పుడు డైటింగ్ కూడా చేసి బాడీ బాగా తగ్గించాను" అని అన్నారు రానా.


దీంతో ఎన్టీఆర్ బయోపిక్ కి ముందుగా తేజని డైరెక్టర్ గా అనుకున్నారు.. అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు. అందుకే క్రిష్ కంటే తేజ ఈ సినిమాకి దర్శకత్వం వహించి ఉంటే సినిమా ఎలా ఉండేదో అని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. తేజ డైరెక్టర్ అయి ఉంటే సినిమా ఇంకా డిఫరెంట్ గా బాగుండేది.. అని మరి కొందరు చెబుతున్నారు. 


రాణా గతంలో తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటించారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే హిట్ అయ్యింది. ప్రస్తుతం రానా..రజినీకాంత్ హీరోగా నటిస్తున్న.. వెట్టాయన్ సినిమాలో నటిస్తున్నారు. టీ జే జ్ఞానవేల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా.. ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల కి సిద్ధం అవుతోంది.


Also read: AP New DGP: ఏపీ కొత్త డీజీపీగా పరిశీలనలో ద్వారకా తిరుమలరావు, దాదాపుగా ఖరారైనట్టే



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook