COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ranbir Kapoor Reveals his First Wife : రణబీర్ కపూర్ తెలుగు వారికి ఇంకా నేరుగా పరిచయం లేకున్నా త్వరలోనే 'బ్రహ్మాస్త్ర'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇటీవలే తన చిరకాల ప్రేయసి అలియా భట్ ను వివాహం చేసుకున్న ఆయన ఇప్పుడు అనుహ్యంగా వార్తల్లోకి ఎక్కాడు. తనకు అలియా రెండో భార్య అంటూ కామెంట్ చేసి షాకిచ్చాడు. అదేంటి అలా ఎలా అని అనుకుంటున్నారా? అయితే మొత్తం కథనం చదవాల్సిందే. ఈ రోజుల్లో రణబీర్ కపూర్ తన రెండు కొత్త చిత్రాల ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. ఆయన సినిమా 'బ్రహ్మాస్త్ర' కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.


అలాగే తాజాగా విడుదలైన 'షంషేరా' ట్రైలర్ కూడా అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ రెండు సినిమాల్లో రణబీర్ కపూర్ చాలా విభిన్నమైన,  అద్భుతమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక కొద్దిరోజుల క్రితం అలియా భట్‌తో వివాహ బంధంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన  తన 'మొదటి భార్య'ని ఇంకా కలవలేదని కామెంట్స్ చేసి రచ్చ రేపారు. ఈ విషయం గురించి రణబీర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంటర్వ్యూలో రణబీర్ తన మొదటి భార్యను కలవలేదని చెప్పాడు. ఆ తర్వాత ఆయన తనకున్న అత్యంత క్రేజీ ఫ్యాన్ గర్ల్ కథ చెప్పుకొచ్చాడు. 


కొన్నాళ్ల క్రితం మా పేరెంట్స్‌తో కలిసి కృష్ణరాజ్‌ బంగ్లాలో ఉండేవాడినని,  ఓ అమ్మాయి ఆ ఇంటికి వచ్చిందని,  ఆమె తమ బంగ్లా  గేట్‌ను పెళ్లాడిందని రణబీర్ చెప్పాడు. ఇంటికి రాగానే మా వాచ్‌మెన్‌ ఈ విషయం చెప్పాడని అన్నారు. నేను ఆమెను ఎప్పుడూ కలవలేదు కానీ ఆమె పంతులుతో వచ్చి మా ఇంటి గేటు వద్ద పెళ్లి చేసుకున్నదని,  గేటుకు పూలదండ వేసి కుంకుమ బొట్టు పెట్టి,  పువ్వులు చల్లి.. ఇక నాకు తనకు పెళ్లయి పోయినట్లేనని సంతోషించి అక్కడి నుంచి వెళ్లిపోయిందని అన్నారు. నేను నా మొదటి భార్యను కలవలేదని,  కానీ జీవితంలో ఏదో ఒక సమయంలో కలుస్తానని నేను ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు.  


రణబీర్ కపూర్ ఏప్రిల్ 14న అలియా భట్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు ఇద్దరూ ఐదేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. ఈ ఏడాది ఈ జంట తొలిసారి కలిసి ఓ చిత్రంలో కనిపించబోతున్నారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న బ్రహ్మాస్త్ర చిత్రంలో ఇద్దరూ జంటగా కనిపించనున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్,  నాగార్జున మరియు మౌని రాయ్ కూడా నటించనున్నారు. సెప్టెంబర్ 9న బ్రహ్మాస్త్ర సినిమా థియేటర్లలో విడుదల కానుంది. 


Also Read: AP Theaters Shutdown: ఏపీలో సినీ థియేటర్లను బంద్ చేయాలని నిర్ణయం..ఎందుకంటే?


Also Read: Puri Warns to Bandla Ganesh: చీప్‌గా వాగొద్దు.. నాలుక కొరికేసుకోవడం మంచిదన్న పూరి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.