Animal: గీతాంజలి స్ట్రాంగ్ అండ్ రా.. నా వరకు ఆ పాత్ర ఎంతో గొప్పది: రష్మిక మందాన
Rashmika Mandanna: రష్మిక మందాన ఇప్పటివరకు చేసిన పాత్రలు అన్నిటికన్నా ఆమెకు ఎక్కువ పేరు తెచ్చి పెట్టింది యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్ర. ఇక ఈ పాత్ర గురించి ప్రస్తుతం రష్మిక పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
Rashmika Mandanna Tweet: యానిమల్ సినిమా విడుదల దగ్గర నుంచి ఈ చిత్రం ఏదో ఒక దానివల్ల వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొంతమంది ఈ సినిమాని చాలా బాగుంది అని ప్రశంసిస్తుండగా మరి కొంతమంది మాత్రం అసలు ఏంటి ఈ సినిమా అని విమర్శిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో పెర్ఫార్మెన్స్ పరంగా బాగా మార్కులు కొట్టేసిన నటి రష్మిక మందాన. తన ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఇప్పటివరకు రష్మిక ఎన్నో చేసిన యానిమల్ సినిమాలో మాత్రం తన పెర్ఫార్మెన్స్ చూపించే అవకాశం వచ్చింది.
ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో రణబీర్ కపూర్ తో ఎమోషనల్ గారి రష్మిక మాట్లాడే సీన్ ఈ చిత్రానికే హైలైట్ గా నిలిచింది. ట్రైలర్ లో ఈ సీన్ ని చూసి కొంతమంది రష్మికనీ ఎక్కిరిచ్చిన.. సినిమా చూసిన తర్వాత మాత్రం ఆ సీన్ లో రష్మిక యాక్టింగ్ కి అందరూ ఫిదా అయిపోయారు.
కాగా ఇప్పుడు ఈ సినిమాలో గీతాంజలి పాత్ర తనకు ఎంతో ప్రత్యేకమని రష్మిక వేసిన పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది.
గీతాంజలి పాత్ర గురించి చెబుతూ.. ‘ యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రను మాటల్లో చెప్పాలంటే.. ఆ కుటుంబాన్ని ఒక్కటిగా కలిపి ఉంచే పవర్ గీతాంజలి. ఆమె ఎంతో ప్యూర్, రియల్, అన్‌ఫిల్టర్డ్, స్ట్రాంగ్ అండ్ రా.. ఆ పాత్రను పోషిస్తున్నప్పుడు నాకు చాలా అనుమానాలు వచ్చేవి.. మా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలి అడిగితే.. రన్‌విజయ్, గీతాంజలి కథ ఇది.. ఇద్దరూ అలానే ఉంటారు.. అది వారి ప్రేమ, వారి జీవితం.. కుటుంబంపై వారికి ఉన్న దృక్ఫథం ఇదే.. అని చెబుతుండేవారు. వయెలెన్స్, బాధలు, భరించలేని గాయాలతో ఉన్న వారికి గీతాంజలి అనే పాత్ర ప్రశాంతతను, ప్రేమను పంచుతుంది.నమ్మకాన్ని కలిగిస్తుంది.. తన భర్త, పిల్లల కోసం ఆ దేవుడ్ని ప్రార్థిస్తుంటుంది.. ఫ్యామిలీ కోసం ఏం చేయడానికి సిద్దపడుతుంది.. అందుకే నా వరకు మాత్రం నేను పోషించిన గీతాంజలి పాత్ర ఎంతో గొప్పది.. ఫ్యామిలీని కాపాడుకునేందుకు నిలబడుతుంది.. యానిమల్ సినిమా వచ్చి వారం అవుతోంది. ఇంత ప్రేమను చూపిస్తున్న ఆడియెన్స్, అభిమానులకు నా ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ వేసేసింది రష్మిక.
కాగా యానిమల్ సినిమా ఇప్పటికే 500 కోట్లు సంపాదించి ప్రస్తుతం 700 కోట్ల మార్కు వైపు పరుగులు తీస్తోంది. రానున్న రోజుల్లో కలెక్షన్స్ పరంగా ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
Also Read: New Ministers History: తెలంగాణా కొత్త మంత్రుల పూర్తి హిస్టరీ..రాజకీయ అరంగేట్రం వివరాలు..
Also Read: CM Revanth Reddy: కొత్త ప్రభుత్వంలో ప్రక్షాళన.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి