Rashmika in Animal Park: రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఈ చిత్రంలో గీతాంజలి పాత్రలో రష్మిక ఎంతో చక్కగా నటించి మెప్పించింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలప్పుడు రష్మిక పైన కొన్ని కామెంట్స్ వినిపించిన.. సినిమా విడుదలయ్యాక మాత్రం తన నటనకు అందరూ ఫిదా అయిపోయారు. కాగా ఈ చిత్రం క్లైమాక్స్లో ఈ సినిమాకి ఇంకా కొనసాగింపు ఉంది అని.. అదే యానిమల్ పార్క్ అని సందీప్ రెడ్డి అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో ఈ యానిమల్ పార్కులో రష్మిక పాత్ర ఉంటుందా లేదా అని ఎంతోమందికి సందేహాలు మొదలయ్యాయి. ఇక దీనిపైన పక్కా క్లారిటీ ఇచ్చేసింది ఈ హీరోయిన్. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక యానిమల్ సినిమా గురించి మాట్లాడుతూ.. “యానిమల్ పార్క్ గురించి దర్శకుడు సందీప్ నాకు కొన్ని సీన్స్ చెప్పాడు. ఆ సినిమా చాలా భయంకరంగా, వైల్డ్‌గా ఉంటుంది. అలాగే ఈ సీక్వెల్ లో నా పాత్ర కూడా చాలా వైల్డ్‌గా ఉంటుంది” అంటూ రష్మిక ఇంట్రెస్టింగ్ విషయం బయట పెట్టింది. ఇక ఈ కామెంట్స్ తో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది.


అంతేకాకుండా రష్మిక.. యానిమల్ సినిమా గురించి చెబుతూ.. యానిమల్ సినిమా కోసం రణబీర్ తో కలిసి నటించడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని కానీ ఆ సినిమాలో రణబీర్ ని కొట్టే సీన్ తనకు సవాల్ గా అనిపించిందని చెప్పుకొచ్చింది. ఒక్క టేక్ లోనే ఆ సన్నివేశం మొత్తం ముగించామని.. యాక్షన్.. కట్ ఈ రెండే తనకు గుర్తున్నాయి.. మధ్యలో ఏమి గుర్తులేదు అని చెప్పింది. ఆ సీన్ చేస్తున్నప్పుడు చాలా ఎమోషనల్ ఫీల్ అవ్వడం వల్ల కట్ చెప్పాక కూడా ఏడుస్తూ ఉన్నాను అని చెప్పుకొచ్చింది రష్మిక.


కాగా సందీప్ వంగ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్రభాస్ తో చేయాల్సి ఉంది. ప్రభాస్ తో ‘స్పిరిట్’ తెరకెక్కించిన తరువాత ఈ దర్శకుడు యానిమల్ పార్క్ ని పట్టాలు ఎక్కించనున్నారు.


Also Read Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ


Also Read Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు మరోసారి హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అసలేం జరిగిందంటే..?


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter