Rashmika mandanna: టాలీవుడ్, శాండల్‌వుడ్ క్వీన్ రష్మిక మందన్నా బంపర్ ఆఫర్  కొట్టేసింది. ఇప్పటికే హిందీ చిత్ర పరిశ్రమపై కన్నేసిన రష్మికకు..బాలీవుడ్‌లో మెగా ఆఫర్ లభించడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది రష్మిక.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అందమైన చిరునవ్వుతో..చలాకీ నటనతో కవ్వించే అందాలతో తెలుగు, కన్నడ సినిమాల్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నా ( Rashmika mandanna ) ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించింది. టాలీవుడ్ ( Tollywood ), శాండల్‌వుడ్ ( Sandalwood ) సినిమాల్లో స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఈ కూర్గ్ సుందరి..పాన్ ఇండియా కధా నాయికగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. 


పీరియాడికల్ స్పై థ్రిల్లర్ మిషన్ మజ్ను ( Mission majnu ) సినిమాతో బాలీవుడ్ ( Bollywood ) ఎంట్రీ ఇస్తున్న రష్మిక మందన్నా పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఇటీవలే సిద్దార్ధ మల్హోత్రా హీరోగా నటిస్తున్న సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది కూడా. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. మరోవైపు అప్పుడే హిందీలో బంపర్ ఆఫర్ లభించింది రష్మికా మందన్నాకు. బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ( Big B Amitabh Bachchan ) సరసన ఓ ముఖ్య పాత్రలో నటించేందుకు ఆఫర్ వచ్చింది. వికాస్‌భల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపధ్యంగా సాగుతుందని సమాచారం. అమితాబ్ కూతురిగా రష్మిక నటించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం రష్మిక..తెలుగులో పుష్ప చిత్రంలో నటిస్తోంది. 


Also read: Samantha Akkineni: కుర్రకారు మతిపోగోడుతున్న సమంతా.. పిక్స్ వైరల్