Ravi Teja Khiladi Movie update: మాస్​ మహారాజా రవి తేజ హీరోగా నటిస్తున్న (Ravi Teja next Movie) 'ఖిలాడి' సినిమా టైటిల్ సాంగ్​ను గురువారం విడుదల చేసింది చిత్ర బృందం. దీపావళి సందర్భంగా ఈ సాంగ్​ను (Khiladi Title song) యూట్యూబ్​లో విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాట ఎలా ఉందంటే..


దేవి శ్రీ ప్రసాద్​ (డీఎస్​పీ) మార్క్​ మ్యూజిక్​తో (Devi Sri Prasd) ఈ పాట స్టార్ట్ అవుతుంది. 'హీ ఇజ్​ ఏ గ్రాండ్ మాస్టర్​.. హీ ఇజ్ ఏ క్రైమ్​ పోస్టర్​' అనే లిరిక్స్​తో ఈ పాట సాగుతుంది. బ్యాగ్రౌండ్​లో డబ్బు పోస్టర్లు, గ్రాఫిక్స్ కనిపిస్తుంటాయి. పాటలో ఎక్కువ భాగం విదేశాల్లోనే చిత్రీకరించారు.


అయితే పాట ఆధారంగా చూస్తే.. సినిమా మొత్తం క్రైమ్, డబ్బు, రాబరీ చుట్టూ తిరుగుతుందని అర్థమవుతుంది. ఇంగ్లీష్, తెలుగు లిరిక్స్​తో సాగే ఈ పాట అటు క్లాస్​, ఇటు మాస్​ ఆడియన్స్​ను ఆకట్టుకుంటోంది.



Also read: Acharya second single : దీపావళి కానుకగా ‘ఆచార్య’ నుంచి సెకండ్‌ సింగల్‌ ప్రోమో


సినిమా గురించి..


రమేశ్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. క్రాక్​తో విజయం అందుకున్న రవితేజ ఇప్పుడు వరుస సినమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అందులో ముందుగా సిద్ధమవుతున్నది కూడా ఖిలాడి సినిమానే కావడం గమనార్హం.


దీని తర్వాత.. రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, టైగర్​ నాగేశ్వర రావు వంటి సినిమాల్లో రవితేజ హీరోగా నటిస్తున్నారు.


Also read: Attack on Vijay Sethupathi: విజయ్ సేతుపతి లక్ష్యంగా దాడి.. Video viral


Also read: Pooja Hegde : ట్రెడిషనల్ డ్రెస్‌లో టెర్రిఫిక్‌గా పూజా హెగ్డే


ఇద్దరు కథానాయికలు..


ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉన్నారు. అందులో ఒకరు ఇటీవల హిట్​ టాక్​ తెచ్చుకున్న 'ఇచట వాహనములు నిలుపరాదు' సినిమాలో నటించిన.. మీనాక్షీ చౌదరి కాగా మరొకరు డింపుల్ హయాతీ. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్​ అర్జున్​ కీలక పాత్రలో కనిపించనున్నారు. యాంకర్ అనసూయ కూడా నటిస్తున్నట్లు తెలిసింది.


హవీష్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.


Also read: Kurup Telugu Trailer: ఉత్కంఠరేపుతున్న కురుప్ ట్రైలర్


Also read: Malaika Arora spotted outside Diva Yoga: యోగా స్టూడియో బయట మలైకా అరోరా అదిరిపోయే స్టిల్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook