Kurup Telugu Trailer: ఉత్కంఠరేపుతున్న కురుప్ ట్రైలర్

Kurup Telugu Trailer: శ్రీనాథ్ రాజేంద్రన్ డైరెక్ట్ చేస్తున్న కురుప్ మూవీలో దుల్కర్ సల్మాన్ సరసన శోబిత దూళిపాల జంటగా నటిస్తోంది. ఇంద్రజిత్ సుకుమారన్, షైన్ టామ్ చాకో, సన్ని వేన్, భరత్ నివాస్ సపోర్టింగ్ పాత్రల్లో కనిపించనున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2021, 09:53 PM IST
Kurup Telugu Trailer: ఉత్కంఠరేపుతున్న కురుప్ ట్రైలర్

Kurup Telugu Trailer: దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న కురుప్ సినిమా తెలుగు ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. శ్రీనాథ్ రాజేంద్రన్ డైరెక్ట్ చేస్తున్న కురుప్ మూవీలో దుల్కర్ సల్మాన్ సరసన శోబిత దూళిపాల జంటగా నటిస్తోంది. ఇంద్రజిత్ సుకుమారన్, షైన్ టామ్ చాకో, సన్ని వేన్, భరత్ నివాస్ సపోర్టింగ్ పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ 12న ఈ కురుప్ సినిమా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ కురుప్ ట్రైలర్‌ని విడుదల చేశారు. సినిమాలో ట్విస్టులు, ఉత్కంఠరేపే సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయని కురుప్ ట్రైలర్ (Kurup trailer) వీక్షిస్తే అర్థమవుతోంది.

 

మహానటి మూవీ సక్సెస్ అయిన అనంతరం దుల్కర్ సల్మాన్‌కి తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ కారణంగానే కురుప్ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న మరో డైరెక్ట్ తెలుగు సినిమాలోనూ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Trending News