Ravanasura Movie Teaser మాస్ మహారాజా రవితేజ హీరోగా రావణాసుర అనే సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రంలో సుశాంత్ ముఖ్య పాత్రను పోషించాడు. తాజాగా రావణాసుర సినిమా టీజర్‌ను మేకర్లు విడుదల చేశారు. అయితే ఈ టీజర్‌లో రవితేజ మాత్రం మరీ వయలెంట్‌గా కనిపిస్తున్నాడు. దారుణాతి దారుణంగా చంపేస్తున్నాడు. సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు.. ఈ రావణాసురుడ్ని దాటాలి అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ టీజర్‌ను చూస్తుంటే ఇదొక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ అని తెలుస్తోంది. రవితేజ వరుసగా హత్యలు చేస్తూ వెళ్తున్నాడు. ఇక జయరామ్ వాటిని కనిపెట్టే ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. ప్రతీ కిల్లర్ మర్డర్ చేసినప్పుడు తన సైన్ వదిలి వెళ్తాడు.. ఆ  సైన్ ఏంటో కనిపెట్టాలి అంటూ చెప్పిన డైలాగ్‌ బాగుంది. మొత్తానికి టీజర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశాడు సుధీర్ వర్మ.


 



ఇప్పుడు రవితేజ ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఖిలాడీ సినిమా డిజాస్టర్ అయినా కూడా ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏకంగా వంద కోట్ల గ్రాస్ రాబట్టి అందరినీ మెప్పించింది. వంద కోట్ల క్లబ్బులో మొదటి సారిగా రవితేజ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇదిలా ఉంటే.. రవితేజ స్పెషల్ రోల్ చేసిన వాల్తేరు వీరయ్య డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.


అలా వరుసగా రవితేజ నటించిన సినిమాలు హిట్ అవుతుండటంతో.. డిమాండ్ పెరిగింది. రావణాసుర సినిమాపై ఇప్పుడు మంచి బజ్ ఏర్పడింది. రావణాసుర సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే ఏప్రిల్ 7న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. అను ఇమాన్యుయేల్, ఫరియా, మేఘా ఆకాష్ నటిస్తోన్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీం వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు.


Also Read:  Manchu Manoj Marraige : ఏ జన్మ పుణ్యమో నాది.. మంచు మనోజ్ ఎమోషనల్


Also Read: Shruti Hassan Knee Injury : శ్రుతి హాసన్ మోకాళ్లకు గాయం.. నెటిజన్ల సెటైర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook