Dhamaka Movie Collections: రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ధమాకా మూవీ కలెక్షన్స్ ధమాకా అనిపిస్తున్నాయి. త్రినాథ రావు డైరెక్ట్ చేసిన ధమాకా మూవీకి థియేటర్లలో మంచి స్పందన కనిపిస్తోంది. రవితేజ ఎనర్జిటిక్ పర్‌ఫార్మెన్స్, గ్లామర్ డాల్ శ్రీలీల డ్యాన్స్ మూవ్స్ ఆడియెన్స్ ని కట్టిపడేస్తున్నాయి. పైగా పెస్టివల్ వీకెండ్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. శుక్రవారం రిలీజైన ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ రూ. 19 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని ధమాకా మూవీ యూనిట్ స్వయంగా వెల్లడించింది. ఆదివారం వీకెండ్‌కి తోడు క్రిస్మస్ పర్వదినం కూడా కావడంతో ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేటప్పటికీ కలెక్షన్స్ పరంగా ఈ సినిమాకు ఇంకొంత కలిసొస్తుంది అని బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రావు రమేశ్, జయరాం, తనికెళ్ల భరణి, ప్రవీణ్, సచిన్ ఖేద్కర్ వంటి నటులు ధమాకా మూవీలో ఇతర కీలక పాత్రలు పోషించారు. బీమ్స్ సిసిరిలియో కంపోజ్ చేసిన మ్యూజిక్ థియేటర్లలో ఆడియెన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించి ఈ సినిమాకు ఫస్ట్ డే మ్యాట్నీ నుంచే హౌజ్‌ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. ఈ పాజిటివ్ టాక్‌తో ఈ ఈవినింగ్ షోస్, రెండో రోజు కూడా థియేటర్లు హౌజ్ ఫుల్ అయ్యాయి. రవితేజ కెరీర్లో ఇటీవల ఈ సినిమానే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఓపెనర్‌గా నిలిచినట్టు బాక్సాఫీస్ వర్గాల టాక్.


ఇది కూడా చదవండి : Sekhar Master : శేఖర్ మాస్టర్ ప్రయోగం.. సిరి, శ్రీహాన్‌లపై డబ్బులు పెడితే వస్తాయా?


ఇది కూడా చదవండి : Nagarjuna: సినీ ప్రముఖులు మరణిస్తే..నాగార్జున ఎందుకు వెళ్లరు


ఇది కూడా చదవండి : Rakul Preet Lover : సాంటా ఇచ్చిన గిఫ్ట్ అదే.. లవర్‌కు రకుల్ ప్రీత్ స్పెషల్ విషెస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook