Nagarjuna: సినీ ప్రముఖులు మరణిస్తే..నాగార్జున ఎందుకు వెళ్లరు

Nagarjuna: టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ విషయంపై చర్చ జరుగుతోంది. సినీ పరిశ్రమలో ప్రముఖులు వరుసగా మరణిస్తున్నా..కింగ్ నాగార్జున మాత్రం చివరి చూపుకు వెళ్లకపోవడం ఆసక్తిగా మారింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 25, 2022, 05:37 PM IST
Nagarjuna: సినీ ప్రముఖులు మరణిస్తే..నాగార్జున ఎందుకు వెళ్లరు

మొన్న కృష్ణంరాజు, నిన్న కృష్ణ..నేడు కైకాల సత్యనారాయణ, చలపతిరావు. ఇలా ఒక్కొక్కరిగా తనువు చాలిస్తున్నారు. సినీ ప్రముఖులంతా చివరి చూపుకు వెళుతున్నా..నాగార్జున మాత్రం దూరంగా ఉంటున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది. 

తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవలి కాలంలో సెలెబ్రిటీల మరణవార్తలు విన్పిస్తున్నాయి. మొన్న కృష్ణంరాజు, నిన్న సూపర్‌స్టార్ కృష్ణ మరణించగా..ఇప్పుడు కైకాల సత్యనారాయణ, చలపతిరావులు కన్నుమూశారు. మొత్తం సినీ పరిశ్రమ అంతా నివాళి అర్పించింది. అందుబాటులో ఉన్న నటీనటులందరూ ఇళ్లకు వెళ్లి..భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కానీ ఒక్క నాగార్జున మాత్రం ఎక్కడికీ వెళ్లిన దాఖలాల్లేవు. ఎవరు చనిపోయినా చివరి చూపుకు సైతం వెళ్లడం లేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ప్రస్తావన వచ్చినా..అభిమానులే సర్దిచెప్పుకునే పరిస్థితులు కన్పించాయి.

మరణించినప్పుడు భౌతిక కాయానికి నివాళులు అర్పించకుండా ఆ తరువాత 4-5 రోజుల తరువాత వెళ్లి కుటుంబసభ్యుల్ని పరామర్శించడం మాత్రం చేస్తున్నారు నాగార్జున. నాగార్జున కుమారులు నాగ చైతన్య, అఖిల్ మాత్రం భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. నాగార్జున ఎందుకు వెళ్లడం లేదనేది మాత్రం ప్రతిసారీ చర్చనీయాంశమౌతూనే ఉంది. శుభకార్యాలకు హాజరయ్యే నాగార్జన విషాధ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటారో ఎవరికీ అర్ధం కావడం లేదు. రాను రానూ ఈ ప్రశ్న తీవ్రమౌతోంది. ఇప్పటికైనా దీనిపై నాగార్జున నోరు విప్పి స్పందించాల్సిందే. ఎందుకు చావు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారో వివరణ ఇవ్వాల్సిన అవసరముందంటున్నారు అంతా.

Also read: Tees Maar Khan Producer : స్పీడు మీదున్న తీస్ మార్ ఖాన్ నిర్మాత.. బర్త్ డే స్పెషల్‌గా మరిన్ని ప్రాజెక్ట్‌లపై ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News