Gowtam Tinnanuri Ram Charan RC 16 Shelved : రామ్ చరణ్‌ గౌతమ్ తిన్ననూరి కాంబోలో రావాల్సిన RC 16 సినిమా ఆగిపోయింది. ఈ మేరకు రామ్ చరణ్‌ టీం నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి కలిసి సినిమా చేస్తారంటూ ఆర్ఆర్ఆర్ సమయం నుంచి వినిపిస్తూనే వచ్చింది. అధికారికంగా ప్రకటించారు. రామ్ చరణ్‌ కోసం మంచి కమర్షియల్ కథనే గౌతమ్ తిన్ననూరి రెడీ చేశాడని సమాచారం వచ్చింది. అయితే గౌతమ్ సినిమాను మాత్రం రామ్ చరణ్ పక్కన పెట్టేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా RC 16 సినిమాను అటకెక్కించడానికి గల కారణం మాత్రం తెలియడం లేదు. గౌతమ్ అసలే సెన్సిబుల్ డైరెక్టర్.. ఇప్పుడు ఇలాంటి సాఫ్ట్ డైరెక్టర్‌తో సినిమా తీస్తే మొదటికే మోసం వస్తుందా? అని రామ్ చరణ్‌ భయపడ్డట్టున్నాడు. రాధే శ్యామ్‌ సినిమాతో ప్రభాస్ పరిస్థితి ఏమయిందో అందరం చూశాం. అందుకే రామ్ చరణ్‌ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు వద్దని అనుకుంటున్నట్టున్నాడు. ఏదైనా మంచి కమర్షియల్ అంశాలతోనే ఉన్న చిత్రాన్ని చేయాలని భావించినట్టున్నాడు.


అందుకే గౌతమ్ వంటి సెన్సిబుల్ డైరెక్టర్‌ను పక్కన పెట్టేశాడు.జెర్సీ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చి పెట్టింది కానీ.. లాభాలు మాత్రం తీసుకురాలేకపోయింది. అందుకే గౌతమ్ తిన్ననూరి కథను పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రామ్ చరణ్‌ కన్నడ దర్శకుడితో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. మరి గౌతమ్ సైతం తన కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నాడట. సమంత వల్ల ఖుషీ సినిమా ఆలస్యం అవుతోన్న సంగతి తెలిసిందే.


ఈ గ్యాప్‌లో విజయ్, గౌతమ్ తిన్ననూరి కలిసి ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారట. మరి ఇదైనా పట్టాలెక్కుతుందా? లేదా? అన్నది చూడాలి. ఏది ఏమైనా ఇది గౌతమ్ తనని తాను నిరూపించుకోవాల్సిన టైం. అలానే విజయ్ సైతం తన సత్తా ఏంటో మరోసారి అందరికీ చూపించాల్సిన టైం. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది వంటి తదితర అంశాలు త్వరలోనే బయటకు వస్తాయని తెలుస్తోంది.


Also Read : Unstoppable season 2 episode 3 Promo : పాతిక ముప్పై మంది హీరోయిన్లతో చేసి ఉంటారు కదా?.. బాలయ్యపై శర్వానంద్ నాటీ కామెంట్స్  


Also Read : Geetu Vs Baladitya : దాన్ని నమ్మొద్దని అందరూ చెప్పారు.. గీతూ చీప్.. ఎంత దిగజారావ్..  ఏడ్చేసిన బాలాదిత్య


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook