Unstoppable season 2 episode 3 Promo : పాతిక ముప్పై మంది హీరోయిన్లతో చేసి ఉంటారు కదా?.. బాలయ్యపై శర్వానంద్ నాటీ కామెంట్స్

NBK Unstoppable season 2 episode 3 Promo అన్ స్టాపబుల్ రెండో సీజన్ మూడో ప్రోమో వచ్చింది. ఈ ఎపిసోడ్‌లో అడివి శేష్, శర్వానంద్‌లు సందడి చేశారు. ఇక బాలయ్యతో నాటీ ముచ్చట్లు పెట్టేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2022, 01:53 PM IST
  • దూసుకుపోతోన్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్
  • మూడో ఎపిసోడ్ ప్రోమో విడుదల
  • బాలయ్యను ఇరికించిన శర్వానంద్
Unstoppable season 2 episode 3 Promo : పాతిక ముప్పై మంది హీరోయిన్లతో చేసి ఉంటారు కదా?.. బాలయ్యపై శర్వానంద్ నాటీ కామెంట్స్

Unstoppable season 2 episode 3 Promo : నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ షో ఎంతగా క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. మొదటి సీజన్ ఓ రేంజ్‌లో క్లిక్ అవ్వడంతో రెండో సీజన్ మీద మరింత దృష్టి పెట్టారు. అయితే ఈ రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌లో చంద్రబాబు, లోకేష్‌లు సందడి చేశారు. రెండో ఎపిసోడ్‌లో విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ వంటి మాస్ హీరోలు వచ్చారు. ఇక ఈ మూడో ఎపిసోడ్‌కు క్లాస్ హీరోలైన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లైన శర్వానంద్, అడివి శేష్‌లు గెస్టులుగా వచ్చారు.

రెండో ఎపిసోడ్లో బాలయ్య తన క్రష్ రష్మిక అని చెప్పడంతో.. ఈ ఎపిసోడ్‌లో ఆ కోరికను తీర్చేశాడు శర్వా. రష్మికకు వీడియో కాల్ చేసి మరీ బాలయ్యతో మాట్లాడించాడు. ఇక బాలయ్య ఈ కుర్ర హీరోలతో బాగానే కలిసిపోయాడు. శర్వా అయితే ఏకంగా బాలయ్య నాటీ పనులను బయటకు లాగేందుకు ప్రయత్నించాడు. మీరు వంద సినిమాలకు పైగా చేశారు కదా? అంటే పాతిక ముప్పై మంది హీరోయిన్లతో చేశారు కదా? అని బాలయ్యను ఇరికించే ప్రయత్నం చేశాడు శర్వా.

 

ఏం చేశాడు రా? అని అడివి శేష్‌ నోరెళ్లబెట్టేశాడు. అదే యాక్టింగ్ చేశారు కదా? అని అడుగుతున్నా అంటూ కవర్ చేసేశాడు శర్వానంద్. ఇదే బీ, సీ సెంటర్ల తెలివితేటలు అని బాలయ్య కౌంటర్ వేశాడు. దీంతో శర్వా, అడివి శేష్ ఇద్దరూ పగలబడి నవ్వేస్తారు. ఇలా ఎపిసోడ్ అంతా కూడా ఫన్నీగానే సాగింది. పెళ్లి మీద ప్రశ్నలు వేశాడు. ఇండస్ట్రీలో చాలా మంది పెద్దవాళ్లున్నారు.. ప్రభాస్, శర్వా వంటి వారు పెళ్లి చేసుకున్న తరువాత నేను చేసుకుందామని అనుకుంటున్నాను.. అని అడివి శేష్ అంటాడు. నేను ప్రభాస్ పేరు చెప్పుకుని తప్పించుకుంటూ ఉంటే నువ్ నా పేరు చెప్పుకుంటున్నావా? అని శేష్ పరువుతీస్తాడు శర్వా.

ఇక నిజం చెబితే బట్టలు ఇప్పాలంటూ ఓ టాస్క్ పెట్టాడు బాలయ్య. ఇందులో తనకు సంబంధించిన ప్రశ్నే అడిగేసుకున్నాడు. సెల్ఫీ అడిగితే కొట్టే హీరో ఎవరు? అని బాలయ్య అడుగుతాడు. దానికేం సమాధానం చెప్పాలో తెలియక శర్వా, శేష్ ఇద్దరూ నీళ్లు తడుముకుంటారు. జాను సినిమా సమయంలో జరిగిన ప్రమాదం మీద శర్వాను అడిగాడు బాలయ్య. ఇలా ఈ ఎపిసోడ్‌లో అన్ని కోణాలను టచ్ చేశారు.

Also Read : Pranitha Subhash Pics : దేవుడి సన్నిధిలో హీరోయిన్ ప్రణీత.. పిక్స్ వైరల్

Also Read : Geetu Vs Baladitya : బాలాదిత్య ఏడుపు.. గీతూ శునకానందం.. శాడిస్ట్ సైకోలా కంటెస్టెంట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News