Rukmini Vasanth Telugu movies: ఈ మధ్యకాలంలో కన్నడ నుంచి వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో ..సప్త సాగరాలు దాచీ ఎల్లో (సప్త సాగరాలు దాటి) సినిమా ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకట్టుకుంది. తెలుగులో ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా హిట్ అవ్వలేదు కానీ.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది. ముఖ్యంగా అందులో హీరోయిన్ గా నటించిన రుక్మిణి వసంత్ కి.. తెలుగులో కూడా మంచి ఫాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా మొదటి భాగం విడుదలైన వెంటనే.. తెలుగు నుంచి చాలామంది దర్శక నిర్మాతలు.. ఆమెకు సినిమా ఆఫర్లు ఇచ్చారని వార్తలు కూడా వినిపించాయి. అసలే తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు రావడం లేదు అనుకుంటున్నా సమయంలో.. రుక్మిణి వసంత్ అందరి దృష్టిని బాగా ఆకట్టుకుంది. ఇక్కడి వరకు కథ బాగానే ఉన్నా.. ఆ తరువాతే అసలైన సమస్యలు వచ్చి పడ్డాయి. సప్త సాగరాలు దాటి సినిమా విడుదల ఎన్నో రోజులు అయిపోయిన.. ఈ హీరోయిన్ ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులకి మరో సినిమాతో దగ్గర కాలేదు. అలా అని ఏమి అసలు ఏ తెలుగు సినిమాలో నటించలేదు.. అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. 


రుక్మిణి వసంత్ .. ఎప్పుడో ఒక తెలుగు సినిమా చేసేసింది. అందులో నిఖిల్ హీరోగా నటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదలకి నోచుకోలేదు. మరి అంతలా పేరు తెచ్చుకున్న రుక్మిణి అసలు ఆ తరువాత కనీసం విడుదల కూడా కానీ సినిమా మాత్రమే చేజిక్కించుకోవడానికి కారణాలు ఎన్నో వినిపిస్తున్నాయి. 


 


ముఖ్యంగా కొత్తగా వచ్చాక చాలామంది హీరోయిన్లకి సరైన మార్గం చూపించే మేనేజర్లు దొరకరు. అదే పరిస్థితి ఈ హీరోయిన్ కి కూడా ఏర్పడింది అని వినికిడి. ఈ క్రమంలోనే రుక్మిణి వచ్చిన ఆఫర్లలో సగం ఆఫర్లు కోల్పోయిందట. గత ఆరు నెలల్లో రుక్మిణి చాలానే స్క్రిప్ట్ లు వినింది.. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదంట.


తాజా సమాచారం ప్రకారం రుక్మిణి వసంత్ ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా.. దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. స్క్రిప్ట్ మెరిట్ చేశాక.. ఆమెకి నచ్చిందో లేదో తెలుసుకోవడానికి చిత్ర బృందానికి రెండు మూడు నెలలు పట్టిందట. అయితే దర్శకుడు మాత్రం ఆమెను పర్సనల్గా వెళ్లి కలిశాక ఆమె ఓకే చెప్పిందట. ఇది మొత్తం చూస్తే.. రుక్మిణి సినిమాల ఆలస్యానికి కారణం ఆమె చుట్టూ ఉన్న మనుషులు అని సినీ వర్గాల సమాచారం.


 


మరోవైపు మహేష్ దర్శకత్వంలో రామ్ పోతేనేని సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా ఎంపిక అయింది అని వార్త వచ్చాయి కానీ.. అది కూడా నిజమవలేదు.  మరోవైపు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఒక సినిమా ఆఫర్ ఈమె రిజెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి కానీ.. అసలు అ స్క్రిప్ట్ ఆమెదాకా వెళ్ళిందో లేదో కూడా తెలియడం లేదు. మొత్తానికి ఎంత బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నా కూడా.. ఈ రకంగా రుక్మిణి వసంత్ బోలెడు ఆఫర్లు పోగొట్టుకుంటోందని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.


Also Read: Big Shock To YSRCP: జగన్‌కు షాక్‌ల మీద షాక్‌.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా


Also Read: Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook