Pushpa Item Song: టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా అంతా ఓ ఎత్తైతే..సమంత చేసిన ఐటమ్ సాంగ్ మరో ఎత్తు. అలాంటి పాటకు సమంత ఎందుకు అంగీకరించిందనేది ఇప్పటి వరకూ ఉన్న టాక్. ఇప్పుడా విషయంలో స్పష్టత వచ్చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప సినిమా(Pushpa Movie)యాక్షన్ పరంగా ఎంతగా థ్రిల్లింగ్ రేపుతుందో పాటల పరంగా కూడా అంతే బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల రికార్డు సృష్టిస్తోంది. లెక్కల మాస్టారు సుకుమార్-ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ మూవీ పుష్ప మెగా హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. శ్రీవల్లి, సామి, ఇది నా అడ్డా, ఊ అంటావా పాటలతో దుమ్ము రేపుతోంది. సినిమా అంతా ఓ ఎత్తైతే..ఊ అంటావా పాట మరో ఎత్తు. సినిమాలో ఈ పాట రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ పాట లిరిక్స్ ఓ కారణమైతే..టాలీవుడ్ బ్యూటీ సమంత ఆ పాటలో ఐటమ్ డ్యాన్స్ వేయడం మరో కారణం. 


ఈ సాంగ్ లిరికల్ పరంగా, డ్యాన్స్ పరంగా, డ్రెస్సింగ్ పరంగా చాలా బోల్డ్‌గా ఉండటంతో అనేక విమర్శలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే పురుష సంఘం ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఇదంతా ఇలా ఉంటే..అసలు ఇంత బోల్డ్‌గా ఉన్న ఐటమ్ సాంగ్‌కు సమంత ఎలా ఒప్పుకుందనే సంశయం చాలామందిలో ఉంది. ఈ సంశయానికి దర్శకుడు సుకుమార్ తెర దించేశారు. పూర్తి వివరాలు అందించారు. ఆ ఐటమ్ సాంగ్‌కు సమంత అంగీకరించడానికి కారణాల్ని వెల్లడించారు. పాటలో మగవాళ్ల బుద్దిని విమర్శిస్తూ ఉన్న సాహిత్యం కారణంగా సమంత అంగీకరించిందనే ప్రచారం జరుగుతోంది. అసలు విషయమేంటో సుకుమార్(Sukumar)వెల్లడించారు. నాగ చైతన్యతో విడాకుల అనంతరం మగవారిపై అసహ్యంతో ఒప్పుకుందనే ప్రచారం సాగింది. 


సమంతను(Samantha)ఐటెం సాంగ్‌లో భాగం చేయాలనేది తన ఆలోచన అని..అయితే సమంత అంత సులభంగా ఒప్పుకోలేదని సుకుమార్ తెలిపారు. తొలుత..ఇప్పుడది అవసరమా అని నిరాకరించిందన్నారు. ఇప్పటి వరకూ అన్నిరకాల పాత్రలు పోషించావు..ఐటెమ్ నెంబర్‌లో కూడా కన్పిస్తే ఒక సర్కిల్ పూర్తవుతుందని వివిధ రకాలుగా ఒప్పించేందుకు ప్రయత్నించానని సుకుమార్ చెప్పారు. చివరి క్షణం వరకూ అలాంటి పాట చేయాలా వద్దా అనే ఆలోచనలోనే ఉందన్నారు. 


Also read: Pushpa Movie at 150 Crores Club: 150 కోట్ల క్లబ్‌కు చేరువలో దూసుకెళ్తున్న పుష్ప సినిమా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook