Rebel Star Krishnam Raju Condolonce Meet at Mogalturu: రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11వ తేదీన హైదరాబాద్ లో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు, దశదినకర్మలను కూడా హైదరాబాదులోనే నిర్వహించారు. 22- 23వ తారీకులలో ఆయన దశ దిన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే కృష్ణంరాజు సొంత ఊరు నరసాపురం నియోజకవర్గంలో ఉన్న మొగల్తూరు కావడంతో అక్కడ ఒక భారీ సంస్మరణ సభ నిర్వహించేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం నాడు ఈ సంస్మరణ సభ మొగల్తూరులో భారీ ఎత్తున జరగబోతోంది. ఇప్పటికే ప్రత్యేక బృందాలుగా కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఏర్పడి గ్రామంలోని ప్రతి ఇంటికి సమాచారం అందించారు. ఈ క్రమంలో గ్రామంలోనే కాకుండా మొగల్తూరు మండలంలో కూడా దాదాపు చాలామందిని ఈ సంస్కరణ సభకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అలాగే ఉభయగోదావరి జిల్లాలలో కృష్ణంరాజుతో కాస్త సాన్నిహిత్యంగా ఉండే ప్రతి ఒక్కరిని ఈ సంస్థను సభకు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.


కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో పాటు ఈ కార్యక్రమానికి హీరో ప్రభాస్ కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే ఆయన హైదరాబాద్ నుంచి మొగల్తూరు బయలుదేరి వెళ్లారు. సుమారు 12 ఏళ్ల తర్వాత ఆయన మొగల్తూరు వెళుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సంస్మరణ సభకు వచ్చే వారెవరినీ భోజనం పెట్టకుండా పంపకూడదనే ఉద్దేశంతో సుమారు 50 వేల మందికిపై భోజనానికి ఏర్పాట్లు చేస్తున్నారు అని తెలుస్తోంది. మొగల్తూరు చిన్న గ్రామం కావడంతో అక్కడ ఎవరూ ఇబ్బంది పడకుండా దారి పొడవునా బారికేడ్లతో విభజించి పోలీసులు కూడా పెద్ద ఎత్తున కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు.


ఇప్పటికే కృష్ణంరాజు కుటుంబ సభ్యులు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్, పలు జిల్లాల అధ్యక్షులు, అక్కడికి చేరుకుని పూర్తిస్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. తెలుగుదేశానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు సైతం ప్రభుత్వం నుంచి పార్టీల నుంచి పూర్తి సహకారం అందిస్తామని కూడా కృష్ణంరాజు కుటుంబ సభ్యులకి చెప్పినట్లుగా తెలుస్తోంది.


Also Read: Chandrababu in Unstoppable: బాలకృష్ణ షోలో చంద్రబాబు.. అక్టోబర్ 4న విజయవాడలో ప్లానింగ్?


Also Read: God Father Pre Release Event : ఇద్దరు మెగాస్టార్ లు ఒకే ఈవెంట్లో.. ఇక రచ్చ రచ్చే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook