Renu desai comments on her son akiranandan: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించినట్లు తెలుస్తొంది. అక్కడ పలు ప్రాంతాలను, పచ్చని పొలాలను ఆస్వాదించినట్లు తెలుస్తొంది. ఇక్కడ ప్రాంతాలతో తన మనసుకు ఎంతో అనుబంధముందని నటి అన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో నటి తన కొడుకు అకిరా నందన్ సినిమాల్లో ఎప్పుడు వస్తాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అకీరా కూడా సినిమాల్లో వచ్చి మంచిగా రాణించి, తనకంటూ గుర్తింపు తెచ్చుకొవాలని ఉందని రేణుదేశాయ్ అన్నట్లు తెలుస్తొంది.  అయితే.. గేమ్ ఛేంజర్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న రాజమండ్రిలో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమను ఏపీలో డెవలప్ మెంట్ చేయాలని పిలుపు నిచ్చారు.


తెలుగు పరిశ్రమల పెద్దలు ఏపీకి వచ్చి.. ఇక్కడి యువతకు ఆయా రంగాలలో మెళకువలు నేర్పించాలని కూడా పవన్ వేదికమీద నుంచి కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పుకొవచ్చు.  


అయితే... సినిమా షూటింగ్స్ కి  గోదావరి జిల్లాల వంటి అందమైన లొకేషన్స్ తాను ఎక్కడా చూడలేదని.... విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని పొలాలు చూడ్డానికి రెండు కళ్ళు నిండిపోయాయనీ రేణు దేశాయ్ పేర్కొన్నారు. ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితే తనకు అంతకన్న  సంతోషం మరోకటిలేదన్నారు.  మూగజీవాల పట్ల తాను చూపుతున్న ప్రేమపై స్పందిస్తూ....చిన్నప్పటి నుంచి మూగజీవాల సంరక్షణ పట్ల ఆసక్తి ఉందనీ అన్నారు.


సామాజిక సేవా కార్యక్రమాల కోసం తన కుమార్తె ఆద్య పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశాననీ వెల్లడించారు.  ఈ నేపథ్యంలో..  తూర్పుగోదావరి జిల్లా...రాజానగరం మండలం నరేంద్రపురంలో ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ లో ఐదు రకాల కొత్త ఉత్పత్తులను ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా  ఉన్న రేణుదేశాయ్ ప్రారంభించారు.


Read more: Viral Video: ఎయిర్ పోర్టులో ఆరాధ్య చిలిపి చేష్టలు.. షాక్‌కు గురైన ఐశ్వర్య రాయ్.. వీడియో వైరల్..


 ఈ క్రమంలో.. ప్రొడక్ట్ ను నమ్మితేనే నేను బ్రాండ్ అంబాసిడర్ గా  ఉంటాననీ అన్నారు. ధాన్యకారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో నాణ్యమైన బియ్యం ఉత్పత్తులనే తినాలని రిక్వెస్ట్ చేశారు.. పిల్లలకు ఇడ్లీ, ఉప్మా కంటే మంచి ఆహారం మరొకటి లేదనీ అన్నారు. ఫారెన్ ఆహారాలు కంటే ఆంధ్ర పెసరట్టు హెల్త్ కు మంచిదన్నారు రేణు దేశాయ్..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter