Aaradhya funny thing in Mumbai airport video viral: మాజీ విశ్వ సుందరీ ఐశ్వర్యరాయ్ ఇటీవల న్యూ ఇయర్ వేడుకల్లో ఫుల్ జోష్ గా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తొంది. అయితే. . ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, ఆరాద్యలు ముగ్గురు ముంబై ఎయిర్ పోర్టులో ఒక్కసారిగా కన్పించారు .అయితే.. వీరు ఎయిర్ పోర్టు నుంచి బైటకు వచ్చేటప్పుడు అక్కడున్న అభిమానులు వీరితో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డట్లు తెలుస్తొంది.
కెమెరాలకు చిక్కకుండా.. తొందరగా బైటకు వెళ్లేందుకు ఐశ్వర్య, అభిషేర్ ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఆరాద్య సడెన్ గా గాల్లో ఎగిరి ఐశ్వర్యకు ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఐశ్యర్య రాయ్ తన కూతురు చేసిన చిలిపి పని చూసి షాక్ అయినట్లు తెలుస్తొంది. అక్కడున్న వారంతా.. ఆరాద్య చిలిపిపనిని తమ ఫోన్ లలో రికార్డు చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.
Does anyone else feel that Aaradhya Bachchan’s behavior seems unusual?
Aishwarya Rai always seems extra protective#AishwaryaRaiBachchan pic.twitter.com/YP2v4Onf15
— Surajit (@surajit_ghosh2) January 4, 2025
అయితే.. ఆరాధ్య ఒక్కసారిగా ఇలా ప్రవర్తించడం చూసి.. మొదట.. ఐశ్వర్య ఎవరైన నెట్టేశారో ఏంటో అని అనుకుందంట. కానీ..ఆతర్వాత తన బిడ్డ ఇలా ఫన్నీగా చేసిందని ముందు కొప్పడ్డా.. ఆతర్వాత నవ్వుకుందంట. జాగ్రత్తగా వెళ్లాలని స్వీట్గా తిట్టుకుంటూ చెప్పిందంట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం ఆరాధ్య భలే ఆట పట్టించింది తల్లిని అని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారంట.
మరికొందరు మాత్రం.. కాలుజారీ పడితే.. ఏంటీ సిట్యూవేషన్ అంటూ కౌంటర్ లు ఇస్తున్నారంట. అయితే.. గత కొన్నినెలలుగా అభిషేక్, ఐశ్వర్యలు విడిపోతున్నారని కూడా సోషల్ మీడియాలో తరచుగా వార్తలు ఉంటున్నాయి.
Read more: Tabu: 53 ఏళ్ల వయసులో పెళ్లిపై ఓపెన్ అయిన టబు..?.. అతడి వల్లే ఇదంతా అంటూ షాకింగ్ కామెంట్స్.!
ఈ క్రమంలో ఐశ్వర్య, అభిషేక్, ఆరాధ్యలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లను గ్రాండ్ గా చేసుకున్నట్లు తెలుస్తొంది. దీంతో ఈ రూమర్స్ అన్ని వట్టివే అని కూడా ఇప్పటికే పలు మార్లు దీనిపై ఇన్ డైరెక్ట్ గా వీరి టీమ్ కొట్టిపారేసిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter