Tiger Nageswara Rao Update: మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) నయా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'(Tiger Nageswara Rao). 1970 దశకంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్‌ దొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వర్‌ రావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. డెబ్యూ డైరెక్టర్ వంశీ (Vamsee) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కృతి స‌న‌న్ చెల్లి నుపుర్ సనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. నుపుర్ ఈ మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మూవీపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా అక్టోబరు 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం నుంచి సీనియర్‌ నటి రేణూదేశాయ్‌(Renu Desai) కొత్త లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో రేణూదేశాయ్‌ బిడ్డను ఎత్తుకుని లాలిస్తున్నట్లు ఉంటుంది. ఈ మూవీలో రేణూదేశాయ్‌ హేమలత లవణం పాత్రలో నటిస్తుంది. ఈ మూవీ ట్రైలర్ ను అక్టోబరు 03న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 


ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్‌ ఖేర్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా, కోలీవుడ్ భామ అనుకీర్తి వ్యాస్ జయవాణి పాత్రలో, మురళీ శర్మ విశ్వనాథ శాస్త్రిగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌ సింగిల్ ఏక్‌ దమ్‌ ఏక్‌ దమ్‌ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది.  మరోవైపు రవితేజ ఈగల్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి వచ్చే అవకాశం ఉంది.



Alsoo Read: Kushi on OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'ఖుషి' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి