Renu Desai: ఆ వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకున్నా.. కానీ.. రెండో పెళ్లిపై రేణు దేశాయ్ క్లారిటీ
Renu Desai Second Marriage: పవన్ కళ్యాణ్ తో విడాకులు జరిగిన చాలా సంవత్సరాల తరువాత తాను ఇంకొకరితో ఎంగేజ్మెంట్ చేసుకున్నానని కానీ అది మళ్ళీ తానే క్యాన్సిల్ చేసుకున్నానని తెలియచేసింది రేణుదేశాయ్.. మరి దానికి కారణం ఏమిటో ఒకసారి చూద్దాం
Renu Desai Second Marriage: రేణు దేశాయ్ గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రైల్వేటేషన్ ఆ తరువాత మరలా పవన్ కళ్యాణ్ చేసిన జానీ సినిమాలో కనిపించి మెప్పించింది. ఇక ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ నటి.
వీరిద్దరికీ అఖీరా, ఆధ్యా అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ కారణాలు ఏవో తెలియదు కానీ వీరిద్దరూ పెళ్లి అయిన కొద్ది సంవత్సరాల తరువాత విడిపోయారు. వీరిద్దరూ వారి వారి జీవితంలో బిజీగా ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఎప్పుడూ రేణు దేశాయిని తమ వదిన గానే చూసుకుంటూ వచ్చారు. అందుకే రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తరువాత కూడా ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకోకూడదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ వచ్చారు.
దానికి తగ్గట్టు రేణు దేశాయ్ కూడా ఎప్పుడు రెండో పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. కానీ కొద్ది సంవత్సరాల క్రితం మాత్రం ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్టు రేణు దేశాయ్ ప్రకటించడంతో పవన్ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. కానీ మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు కానీ రేణు దేశాయ్ అతన్ని పెళ్లి చేసుకోలేదు.
ఇక ఎన్ని రోజుల తర్వాత ఇప్పుడు రేణు దేశాయ్ తన రెండో వివాహం గురించి నోరు విప్పింది. ప్రస్తుతం రేణు దేశాయ్ రవితేజ హీరోగా చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా తెలుగులో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనుంది. ఈ సినిమా దసరా కానుకగా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ నటి ఈ సినిమా ప్రమోషన్స్ లో తన పర్సనల్ విషయాలు కూడా పంచుకుంది.
తన రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ.. పవన్తో విడిపొయాక తాను రెండో పెళ్లి చేసుకోవాలని తన సన్నిహితులు ఎంతోమంది సలహాలు ఇచ్చారని తెలియజేసింది. కాగా అందుకే తాను కొద్ది సంవత్సరాల క్రితం వేరే అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్నానని, కానీ ఆ టైంలో తన కూతురు ఆధ్య కి కేవలం ఏడు సంవత్సరాలు కావడం వల్ల తనకు టైం ఇవ్వలేనని భావించి ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నానని చెప్పుకొచ్చింది.
అంతేకాదు ప్రస్తుతం ఆధ్యకి 13 సంవత్సరాలు కాబట్టి ఆమె కాలేజ్ వెళ్లిన తరువాత తన రెండో పెళ్లి గురించి ఆలోచిస్తానని క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయ్. కాగా పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయిన దగ్గర నుంచి పవన్ ఇద్దరు పిల్లలు కూడా రేణు దేశాయ్ దగ్గరే ఉంటున్నారు.
ఇది కూడా చదవండి : చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న బన్నీ..
ఇది కూడా చదవండి : Mahindra SUV Cars: మహీంద్రా ఆ మూడు కార్ల వెయిటింగ్ పీరియడ్ చూస్తే క్రేజ్ ఎలా ఉందో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..