Akira Nandan Video in Flight Journey సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. అకిరా నందన్ ఫోటోలు, వీడియోలు దొరికితే పవర్ స్టార్ అభిమానులు వాటిని తెగ షేర్ చేస్తుంటారు. అలా అకిరా నందన్ ఫోటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఆ మధ్య ఖుషి రీ రిలీజ్ టైంలో అకిరా నందన్ ఫోటోలు, వీడియోలు బాగానే ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్ని రోజులకు అకిరా నందన్ కనిపించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అకిరా నందన్ తన గ్రాడ్యుయేషన్ చదువుల కోసం విదేశాలకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక ఇక్కడ ఆద్య, రేణూ దేశాయ్‌లు ఉన్నారు. ఈ ఇద్దరూ వెకేషన్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. గడ్డ కట్ట చలిలో కాశ్మీర్ లోయలో ఆద్య, రేణూ దేశాయ్‌లు ట్రిప్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ టైంలో అకిరా నందన్ హైద్రాబాద్‌లో ఖుషి సినిమా చూస్తున్నాడు. ఆ ఇద్దరేమో కాశ్మీర్ లోయల్లో తిరుగుతూ ఉన్నారు.


అకిరా నందన్ ఎంట్రీ ఎప్పుడూ అని జనాలు రేణూ దేశాయ్‌ని అడుగుతూనే ఉంటారు. ఇక అకిరా నందన్ గురించి ఎప్పుడూ ప్రశ్నలు అడిగి విసిగిస్తుంటారని, రేణూ దేశాయ్ కామెంట్ సెక్షన్‌ను కూడా డిజబుల్ చేస్తుంటుంది. ఆమె లైవ్‌లోకి వచ్చినా కూడా అకిరా నందన్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతుంటారు. అకిరా నందన్‌ను చూపించండని కోరుతుంటారు. నేను చూపిస్తాను కానీ.. అతనికి ఇష్టం ఉండదు.. ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు అని రేణూదేశాయ్ చెబుతుంటుంది.


 



అయితే తాజాగా రేణూ దేశాయ్ తన కొడుకుతో కలిసి విమానంలో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలోనే రేణూ దేశాయ్ హెడ్ సెట్స్‌ను అకిరా దొంగతనం చేశాడట. ఎందుకంటే అతని ఇయర్ బడ్స్‌లో బ్యాటరీ అయిపోయిందట. అందుకే తన ఓల్డ్ మోడల్‌ హెడ్ సెట్‌ను తీసుకున్నాడంటూ చెప్పుకొచ్చింది. ఇందులో అకిరా నందన్ ఫేస్ మాస్క్ ధరించి ఉన్నాడు. అందుకే పూర్తిగా కనిపించడం లేదు. గడ్డంతో ఉన్నాడా? షేవ్ చేసుకున్నాడా? ఈ సారి ఎలా ఉన్నాడా? అని అభిమానులు అనుకుంటున్నారు.
 


Also Read:  Honey Rose Pics : బాప్‌ రే అనిపించేలా హనీ రోజ్ భారీ అందాలు.. కత్తుల్లాంటి చూపుల్తో కిక్కిస్తోన్న భామ


Also Read: Nithiin Fans : ఫ్లాప్ డైరెక్టర్‌తో నితిన్ సినిమా.. హర్ట్ అయిన అభిమాని.. హీరో రిప్లై ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook