Renu Desai in Tiger Nageswara Rao రేణూ దేశాయ్ వెండితెరపై కనిపించి ఎన్నో ఏళ్లు అవుతోంది. జానీ సినిమా తరువాత మళ్లీ ఇంత వరకు సినిమాల్లో నటించలేదు. ఇక పవన్ కళ్యాణ్‌కు దూరమైన తరువాత సినిమాల వైపు కాస్త అడుగులు వేసింది. కానీ హీరోయిన్‌గా కాదు. ఓ సినిమాను డైరెక్ట్ చేయాలని రేణూ దేశాయ్ ఎప్పటి నుంచో పరితపిస్తోంది. కానీ దానికి కరోనా అడ్డు కట్ట వేస్తూనే వస్తోంది. గత రెండు మూడేళ్ల నుంచి రేణూ దేశాయ్ తన రైతు సినిమా కోసం పడిగాపులు కాస్తూనే ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతలో రేణూ దేశాయ్ బుల్లితెరపై షోలు, వెబ్ సిరీస్‌లు ప్లాన్ చేసింది. ఆద్య అనే వెబ్ సిరిస్‌ను కూడా రేణూ దేశాయ్ ప్రారంభించింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయినట్టు తెలుస్తోంది. కరోనా వల్ల మరింత ఆలస్యం అవుతుండటంతో మధ్యలోనే అటకెక్కినట్టు కనిపిస్తోంది. ఇక ఇప్పుడు రేణూ దేశాయ్ చేతిలో రవితేజ టైగర్ నాగేశ్వరరావు మాత్రమే ఉంది.


 



రవితేజ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో హేమలతా లవణం అనే పాత్రలో రేణూ దేశాయ్ కనిపించబోతోంది. అయితే ఇప్పుడు ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ అయిపోయినట్టుగా రేణూ దేశాయ్ తెలిపింది. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు, పవర్ ఫుల్ రోల్ ఇచ్చినందుకు డైరెక్టర్ వంశీ కృష్ణకు థాంక్స్.. అభిషేక్ అగర్వాల్ వారి వల్లే ఈ యూనిట్ అంతా కూడా నా ఫ్యామిలీలా మారింది.. ఎంతో కంఫర్ట్‌గా పని చేశాను. నా పాత్రకు సంబంధించిన షూటింగ్ జరిగే ప్రతీ క్షణం నేను ఎంజాయ్ చేశాను అంటూ రవితేజ పేరుని మాత్రం ఎక్కడా చెప్పలేదు.


అంటే రవితేజతో కలిసి రేణూ దేశాయ్ ఒక్క రోజు కూడా షూటింగ్ చేయనట్టుగా కనిపిస్తోంది. అసలు ఈ ఇద్దరికీ సినిమాలో ఎదురుపడే సీన్లే ఉండేలా కనిపించడం లేదు. అందుకే రవితేజ గురించి రేణూ దేశాయ్ చెప్పలేదేమో అని అంతా అనుకుంటున్నారు.


Also Read:  Taraka Ratna Health Issue: తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషయంలో తెర వెనుక హీరో.. రుణపడి ఉంటామంటున్న అభిమానులు!


Also Read: Rajinikanth Called : వీర సింహారెడ్డి డైరెక్టర్ కు రజనీకాంత్ ఫోన్.. గాల్లో తేలిపోతున్నాడుగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook