రామ్ గోపాల్ వర్మ వర్సెస్ నిఖిల్ వివాదం పెరుగుతోంది. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల కానున్న పవర్ స్టార్ నేపధ్యంలో చెలరేగిన ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తాజాగా ఆర్జీవీ...హీరో నిఖిల్ పై చేసిన వ్యాఖ్యలు పరాకాష్టకు చేరాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా..ఆ మహాశిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్ధం అయిందిగా అంటూ రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి హీరో నిఖిల్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. దీనికి రామ్ గోపాల్ వర్మ కూడా తానేం తక్కువ తినలేదన్పించారు. దీటైన సమాధానమే ఇచ్చారు. అసలు నిఖిలెవడో నాకు తెలియదని చెప్పారు. అంతటితో ఆగకుండా మరి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిఖిలైనా..కిఖిల్ అయినా అంతా పవన్ కళ్యాణ్ తొత్తులేనని స్పష్టం చేశారు. అలా తొత్తుల్లా ఉంటే పవన్ కు వీరిమీద మంచి అభిప్రాయం ఏర్పడుతుందనేది వారి ఆశ. బానిసత్వం అనేది బుద్ధిలోంచి వచ్చే ఆశ. నాకైతే అతడెవరో తెలియదు అంటూ తీవ్రంగా సమాధానమిచ్చారు. Also read; Powerstar Movie: వర్మపై హీరో నిఖిల్ ఫైర్


ఆర్జీవీ వర్సస్ పవర్ స్టార్ వ్యవహారం ఇప్పుడిప్పుడే ఆగేట్టు లేదు. వివాదం ఎంత రేగినా డోన్ట్ కేర్ అంటున్నాడు వర్మ. ముందు నుంచీ నెగెటివ్ పబ్లిసిటీనే ఇష్టపడే వర్మకు ఇలాంటి వివాదాలు ఎంత పెరిగితే అంత మంచిది మరి. Also read; Power Star Trailer: వర్మ ‘పవర్ స్టార్’ ట్రైలర్ వచ్చేసింది