Powerstar Movie: వర్మపై హీరో నిఖిల్ ఫైర్

రామ్‌గోపాల్ వర్మ  ( Ram Gopal Varma ) తాజాగా నిర్మిస్తున్న‘పవర్‌స్టార్‌’( PowerStar Film  సినిమా గతకొన్నిరోజుల నుంచి టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమాలో పాత్ర‌ధారులంతా.. అచ్చం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, చిరంజీవి, చంద్రబాబునాయుడు తదితర నాయకుల్లా డూప్‌ క్యారెక్టర్స్‌ ఉండ‌టంతో వారి అభిమానులు కోపంతో ఆర్జీవీపై రగిలిపోతున్నారు.

Last Updated : Jul 23, 2020, 11:12 AM IST
Powerstar Movie: వర్మపై హీరో నిఖిల్ ఫైర్

Nikhil: రామ్‌గోపాల్ వర్మ  ( Ram Gopal Varma ) తాజాగా నిర్మిస్తున్న ‘పవర్‌స్టార్‌’ ( Power Star Film )  సినిమా గతకొన్నిరోజుల నుంచి టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమాలో పాత్ర‌ధారులంతా.. అచ్చం ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ ( pawan kalyan )‌, చిరంజీవి, చంద్రబాబునాయుడు తదితర నాయకుల్లా డూప్‌ క్యారెక్టర్స్‌ ఉండ‌టంతో వారి అభిమానులు కోపంతో ఆర్జీవీపై రగిలిపోతున్నారు. ఈ సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా ఎన్నికల తరువాత పవన్ కథను తెరకెక్కిస్తుండటంతో ఇప్పుడు ఇది సెన్సెషనల్‌గా మారింది. ఒక‌ప్పుడు మంచి ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న ఆర్జీవీ ఇప్పుడు వివాదాల‌ అంశాలపై సినిమాలు తీస్తుండటంతో ఆయన్ను చాలామంది బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఏదీ ఏమైనా.. ఆర్జీవీ మాత్రం డోంట్ కేర్.. అంటూ ఎప్పటిలాగానే తనదైన శైలిలో జవాబిస్తున్నారు. Also read: Ram Gopal Varma: దేనికైనా రెడీ.. బస్తీమే సవాల్

తాజాగా ఆర్జీవీ పవర్‌స్టార్‌.. ( Powerstar Trailer ) సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు వర్మపై డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప‌వ‌న్ అభిమాని హీరో నిఖిల్ ( Nikhil Siddhartha ) కూడా వ‌ర్మ‌పై ఫైర్ అయ్యాడు. ఈ మేరకు నిఖిల్ ట్విటర్ ద్వారా వర్మపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. ‘శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్థమయ్యిందిగా’ అంటూ నిఖిల్ ఆర్జీవీని ఉద్దేశిస్తూ.. ట్విట్ చేశాడు. ఈ పోస్ట్‌కి పవర్‌స్టార్, పవన్ కల్యాణ్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చాడు. Also read: Powerstar Trailer Review: ఈ చిత్రం ప్రవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కే అంకితం

అయితే ఇప్పుడు ఈ సినిమాపై మరింత వివాదం జరిగేలా ఉంది. దీనిపై ఇంకా ఆర్జీవీ రియాక్ట్ రాలేదు. ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా జూలై 25న విడుదల కానుంది. Also read: Power Star Trailer: వర్మ ‘పవర్ స్టార్’ ట్రైలర్ వచ్చేసింది

Trending News