Ram Gopal Varma - Honey Moon Express:ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments (USA) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd) పతాకం పై చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్‌ప్రెస్". తనికెళ్ల భరణి మరియు సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని రచయిత దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించగా కె కె ఆర్ మరియు బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ ని నిర్మించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ రోజు కళ్యాణి మాలిక్ స్వరపరిచి, సింగర్ సునీత తో కలిసి పాడిన అందమైన ప్రేమ గీతం 'నిజమా' పాటను సినీ లెజెండ్  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు విడుదల చేశారు. అనంతరం రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ "నా స్నేహితుడు బాల దర్శకత్వం వహించిన హనీమూన్  ఎక్స్‌ప్రెస్ చిత్రం నుంచి  'నిజమా' పాటను ఇప్పుడే చూసాను. పాట చాలా మెలోడియస్ గా ఉంది. చాలా బాగా చిత్రీకరించారు. కెమెరామాన్ పనితీరు మరియు లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఈ పాటను నేను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.ఇప్పుడే కథ విన్నాను. కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలన్నారు.  


దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ గారితో రెండు హాలీవుడ్ చిత్రాలకు పని చేశాను, బ్యూటీ ఆఫ్ ప్యాషన్ మరియు ఆట అనే రెండు చిత్రాలకు పని చేశాను. రెండు చిత్రాలు డెవలప్మెంట్లో ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ మరియు ఆయన చిత్రాలు మా లాంటి దర్శకులకు మంచి స్ఫూర్తి. శివ చిత్రం నాకు దర్శకుడు అవటానికి మంచి స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు ఈ రోజు హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రంతో దర్శకుడిగా ఆయన పక్కన ఉన్నాను. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం మంచి రొమాంటిక్ కామెడీ చిత్రం. చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ళ భరణి మరియు సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ఈ రోజు మా చిత్రంలోని మొదటి పాట నిజమా లిరికల్ వీడియో ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు.


Also Read: One Man Five Women Preganant: వీడు మగాడ్రా బుజ్జి.. 22 ఏళ్లకే ఐదుగురు భార్యలు, ఒకేసారి తల్లులు కాబోతున్నారు


Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook