ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు గెల్చుకుంది. మొన్న గోల్డెన్ గ్లోబ్, నిన్న ఆస్కార్ నామినేషన్, ఇప్పుడు దాదాసాహెబ్ అవార్డు. ఆర్ఆర్ఆర్ సినిమా ఖ్యాతి ఎల్లలు దాటుతోంది. మరోవైపు వివాదాస్పద ది కశ్మీరీ ఫైల్స్ సైతం అవార్డు సాధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్ఆర్ఆర్ సినిమా..దాదాసాహెబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును, ది కాశ్మీరీ ఫైల్స్ బెస్ట్ ఫిల్మ్ అవార్డును గెల్చుకున్నాయి. ది కశ్మీరీ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ కొన్ని ఫోటోలు అప్‌లోడ్ చేశాడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2023లో ది కశ్మీరీ ఫైల్స్ సినిమా బెస్ట్ ఫిల్మ్ అవార్డు సాధించిందని తెలిపాడు. టెర్రరిజం బాధితులకు, దేశ ప్రజలకు అంకితమని వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేశాడు. 


ముంబైలోని 5 స్టార్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అలియా భట్, రణబీర్ కపూర్ నిర్వహించారు. సంజయ్ లీలా బన్సాలీ నిర్మించిన గంగూబాయి కతియావాడి సినిమాలో గంగూబాయి పాత్రకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు దక్కించుకుంది అలియా భట్. ఇక బ్రహ్మాస్త్ర సినిమాలో బెస్ట్ యాక్టర్‌గా రణబీర్ కపూర్, కాంతారా సినిమా నుంచి బెస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌గా రిషభ్ శెట్టి ఎంపికయ్యారు. భేడియా సినిమాలో వరుణ్ ధావన్ పాత్రకు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. అదే సమయంలో ది కశ్మీరీ ఫైల్స్ సినిమాలో అనుపమ్ ఖేర్ నటనకు మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ అవార్డు దక్కింది. ఫిలిం ఇండస్ట్రీలో నిర్వహించిన కాంట్రిబ్యూషన్‌కు సినీ నటి రేఖను సత్కరించారు. 


Also read: Divi Vadthya Tattoo : ఆ పార్ట్‌పై కొత్త టాటూ వేసిన లోబో.. బిగ్ బాస్ దివి ఫోటో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook