RRR Hero Ram Charan dance with wife Upasana and and Sister in Law in wedding ceremony : రామ్ చరణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌. రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్‌ మూవీ ట్రైలర్‌ రిలీజ్ అయి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. (RRR Trailer) ట్రైలర్‌ చూస్తుంటే మతిపోతోందంటూ ఫ్యాన్స్ నుంచి సెలబ్రిటీల దాకా సోషల్ మీడియాలో ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ను (RRR Team) మెచ్చుకుంటున్నారు. ఇక ట్రైలర్‌ను ఎన్టీఆర్ అభిమానులతో పాటు రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామ్ చరణ్ గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌‌తో (RRR Trailer) పాటు మరో వీడియో కూడా దర్శనమిస్తోంది. ఆ వీడియోలో చెర్రీ వేసిన స్టెప్స్ (Ram Charan Dance) ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega power star Ram Charan) తన భార్య..ఉపాసన కొణిదెలతో కలిసి వేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఉపాసన సోదరి అనుష్ప వివాహంలో వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. ఉపాసన సోదరి అనుష్ప పెళ్లి ఆమె ఎంతో కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న అర్మాన్ ఇబ్రహీంతో (Armaan Ibrahim) ఘనంగా జరిగింది. తాజాగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో కామినేని కుటుంబంతో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. 



 


Also Read : RRR Trailer Review: RRR ట్రైలర్ లో ఇది గమనించారా..? రామ్ Vs భీమ్ ఫైట్ సీక్వెన్స్


అనుష్ప, అర్మాన్ ఇబ్రహీంల ఎంగేజ్ ‏మెంట్ నుంచి పెళ్లి దాక ప్రతి వేడుకకు రామ్ చరణ్, ఉపాసన (Upasana) హాజరై సందడి చేశారు. ఇక తాజాగా పెళ్లిలో రామ్ చరణ్, ఉపాసన వేసిన స్టెప్స్ హైలెట్‌గా నిలిచాయి. రామ్ చరణ్ తన భార్య (Ram Charan wife) ఉపాసనతో పాటు మరదలు అనుష్పలతో (Anushpa) కలిసి డ్యాన్స్ చేశారు. మ్యూజిక్‌ డైరెక్టర్లు సాచెత్ తాంండన్ అలాగే పరంపరా ఠాకూర్‌‌ పాట పాడుతుంటే చెర్రీ తన మరదలు అనుష్ప, భార్య ఉపాసనతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి. 



 


Also Read : RRR Movie Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది.. 2 వేల కోట్లు కాదు 20వేల కోట్లు కొల్లగొట్టడం ఖాయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook