RRR rajamouli remuneration: దర్శక ధీరుడు రాజమౌళి. దేశవ్యాప్తంగా ఈ పేరు ఇప్పుడు ఓ సంచలనం. బ్లాక్​ బాస్టర్​ మూవీలకు ఆయన కేరాఫ్​ అడ్రస్​. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ రేంజ్​ తీసుకెళ్లిన ఘనత ఆయన సొంతం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాహుబలి సినిమాతో ఆయన గురించి భారత సినీ పరిశ్రమనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సినీ వర్గాల్లో చర్చనియాంశమైంది. అప్పటి నుంచి ఆయన ఏం చేసిన ఆదో సంచలనంగా మారింది. అందుకే ఆయన తీసిన 'ఆర్​ఆర్​ఆర్​' మూవీకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. రేపే ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్​టీఆర్​, రామ్ చరణ్​లు నటించడం కూడా ఈ సినిమాకు మరిత క్రేజ్ తెచ్చిపెట్టాయి.


మరి ఇంతటి క్రేజ్ ఉన్న ఈ మూవీని ఏ స్థాయి బడ్జెట్​తో నిర్మించి ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ వర్గాల అంచనా ప్రకారం.. రూ.500 కోట్లతో ఈ మూవీని నిర్మించినట్లు తెలిసింది. డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసింది.


ఇదే విధంగా ఈ సినిమాకు రాజమౌళి రెమ్యునరేషన్​ ఎంత? అనే విషయంపై కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినీ వర్గాల ప్రకారం ఈ సినిమా లాభాల్లో 30 శాతం వరకు రాజమౌళికి వెళ్లనున్నట్లు తెలిసింది. అంతే కాదు.. ఇప్పటికే ఆయన రెమ్యునరేషన్​ కింద రూ.80 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.


అయితే నిజానికి సినీ వర్గాల్లో రెమ్యునరేషన్​కు సంబంధించిన సమాచారం ఎప్పుడు అధికారికంగా వెల్లడించరు. ఈ విషయంపై అవగాహన ఉన్న వర్గాలే ఈ విషయాలను చెబుతుంటారు. ఏది ఏమైన.. ఒక్క సినిమాకు డైరెక్టర్​ రూ.80 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం ఓ సంచలనం అనే చెప్పాలి. అంతే కాదు.. భారత సినీ పరిశ్రమలో ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక డైరెక్టర్​ కూడా ఆయనేనట.


Also read: RRR Ticket Price: రేపే ఆర్​ఆర్​ఆర్ విడుదల​- ఒక్కో టికెట్ రేటు ఎంతో తెలుస్తే షాకే!


Also read: RRR Movie Tickets: టిక్కెట్స్ బ్లాక్ చేసి.. మూడు వేలకి ఒక్కో టికెట్ అమ్ముతున్న ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్లు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook