RRR Movie Tickets: టిక్కెట్స్ బ్లాక్ చేసి.. మూడు వేలకి ఒక్కో టికెట్ అమ్ముతున్న ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్లు!!

Distributors block RRR Movie Tickets in Hyderabad. హైద్రాబాద్‌లో ఉన్న అన్ని మల్టీప్లెక్స్, థియేటర్స్‌లలో శుక్రవారం టికెట్స్ బ్లాక్ చేశారు ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్లు. బ్లాక్ చేసిన టిక్కెట్లను ఒక్కోదానికి 2 నుంచి మూడు వేలకు అమ్ముకుంటున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2022, 04:54 PM IST
  • హైద్రాబాద్‌లో ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్ల అరాచకం
  • 3 వేలకి ఒక్కో టికెట్ అమ్ముతున్న ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్లు
  • డిస్ట్రిబ్యూటర్లపై అభిమానుల అసహనం
RRR Movie Tickets: టిక్కెట్స్ బ్లాక్ చేసి.. మూడు వేలకి ఒక్కో టికెట్ అమ్ముతున్న ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్లు!!

Distributors block RRR Movie Tickets in Hyderabad: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం). అత్యంత భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ప్రపంచమంతా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మేనియాలో ఉంది. సినిమా విడుదల కోసం దేశ సినీ ఇండ‌స్ట్రీతో పాటు ఫాన్స్ ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

మొదటి రోజే ఆర్ఆర్ఆర్ సినిమా చూడాలని సినీ ల‌వ‌ర్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఆన్ లైన్ బుకింగ్స్, బెనిఫిట్ షో టికెట్స్ కోసం పోటీపడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్ల భాగ్యనగరంలో అరాచకం చేస్తున్నారు. హైద్రాబాద్‌లో ఉన్న అన్ని మల్టీప్లెక్స్, థియేటర్స్‌లలో శుక్రవారం (మార్చి 25) టికెట్స్ బ్లాక్ చేశారు. ఇక బ్లాక్ చేసిన టిక్కెట్లను ఒక్కోదానికి రెండు నుంచి మూడు వేలకు డిస్ట్రిబ్యూటర్లు అమ్ముకుంటున్నారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని దేవి థియేటర్‌లో ఒక్కో టికెట్‌ను 2 వేలకు విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయారు. 

ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు ఉన్న క్రేజ్‌ను ఇలా వాడుకోవ‌డం దారుణం అంటూ థియేటర్స్‌ వద్ద  ఫాన్స్ మండిప‌డుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లే ఇలా చేస్తే.. టిక్కెట్ ఎలా కొన‌గ‌లుగుతాం అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ టికెట్ ధరలు చూసి కొంద‌రు ఫాన్స్ నిరాశగా ఇంటికు వెళుతున్నారు. టికెట్ దొరకని మెగా, నందమూరి ఫాన్స్ ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఆర్ఆర్ఆర్ కోసం హైద‌రాబాద్‌లో దాదాపు ప‌దిహేను చోట్ల రేపు ఉదయం బెనిఫిట్ షో పడతున్నాయి. ఉద‌యం నాలుగు నుంచి ఏడు గంట‌ల‌ మధ్య ఈ షోలు పడతాయని సమాచారం తెలుస్తోంది. ఈ బెనిఫిట్ షోల‌ను రామ్ చరణ్, ఎన్టీఆర్‌ హార్డ్ కోర్‌ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ షోస్ టికెట్స్‌ను సొంతం చేసుకోవ‌డానికి అభిమానులు పోటీ ప‌డుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం వారికి షాక్ ఇస్తున్నారు. ఓ బెనిఫిట్ షోకు ఈ రేంజ్‌లో ధ‌ర‌లు ఉండడం బహుశా టాలీవుడ్‌లో ఇదే తొలిసారి కావొచ్చు. 

Also Read: IPL 2022: 14 టోర్నీల్లో 20 హ్యాట్రిక్‌లు.. భారత్ నుంచి 11 మంది! అత్యధిక 'హ్యాట్రిక్' హీరో మనోడే!!

Also Read: MS Dhoni Captaincy: అభిమానులకు భారీ షాక్.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఎంఎస్ ధోనీ! సీఎస్‌కే నయా కెప్టెన్ ఎవరంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News