RRR Movie collections: పాన్‌ ఇండియా సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజై అయ్యింది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌తోనే చరిత్ర సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్‌ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తోంది. కేవలం ఏడు రోజుల్లో ఏడు వందల కోట్లకు పైగా సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. బ్రేకులు లేకుండా దూసుకుపోతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో.. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విషయానికి వస్తే.. జూనియర్‌ ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా.. రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటించారు. చెర్రీకి జోడీగా ఆలియా భట్‌..ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్‌, నటించారు. స్టార్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించాడు. రూ.450 కోట్ల పై చిలుకు బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించారు. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అన్ని భాషలలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్ సినిమా.. కలెక్షన్ ల పరంగా రికార్డ్స్ సృష్టిస్తుంది. బాలీవుడ్ లో సైతం మంచి కలెక్షన్ లను రాబడుతుంది.  ఈ మూవీలో పాటలు తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఎన్​టీఆర్​, రామ్​ చరణ్​లు సూపర్ డ్యాన్స్​ చేసిన నాటు నాటు పాట థియేటర్లో చూసిన వారందిని ఒక ఊపు ఊపేస్తోంది. కొంత మంది థియేటర్లలో స్టెప్పులేస్తున్నారు కూడా.



వారంలో 700 కోట్ల క్లబ్‌లో.. 
తొలి  రోజు        - ₹ 257.15 cr
రెండో  రోజు      - ₹ 114.38 cr
మూడో రోజు      -₹ 118.63 cr
నాలుగో రోజు    - ₹ 72.80 cr
ఐదో రోజు         - ₹ 58.46 cr
ఆరో రోజు         - ₹ 50.74 cr
ఏడో రోజు         - ₹ 37.20 cr
మొత్తం           - ₹ 709.36 cr


Also read: LPG Gas Price Hike: భారీగా పెరిగిన LPG గ్యాస్ ధర.. సిలిండర్ పై రూ.250 పెంపు!


Also read: ATF Price hike: కొత్త రికార్డు స్థాయికి ఏటీఎఫ్​ ధర- పెరగనున్న విమాన టికెట్ల ధరలు?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook