RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ విడుదలకు రంగం సిద్ధం, ఎప్పుడు ఎందులో అంటే
RRR Movie: బాహుబలి దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కేకపెట్టించడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈలోగా అప్పుడే ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా సిద్ధమౌతోంది.
RRR Movie: బాహుబలి దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కేకపెట్టించడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈలోగా అప్పుడే ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా సిద్ధమౌతోంది.
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్ రిలీజ్ కాకముందే ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమౌతోంది. బాహుబలి దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై సంచలనం రేపింది. 2021 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతో పోస్ట్ ప్రొడక్షన్ , ప్రమోషనల్ పనులతో బిజీగా ఉంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే దృశ్యాలతో, డైలాగులతో ట్రైలర్ అదరగొట్టిందనే టాక్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో కన్పించే ఈ సినమా ఓ పీరియాడికల్ డ్రామా నేపధ్యంలో తెరకెక్కింది.
ఇంకా థియేటర్ విడుదల కాకముందే..ఓటీటీ విడుదలకు సంబంధించిన రంగం సిద్ధమౌతోందనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. జనవరి 7వ తేదీన థియేటర్లలో విడుదలైన రెండు నెలలకే ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Movie) అంటే మార్చ్ నెలలో ఓటీటీలో విడుదల కానుందని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్(Netflix)దక్కించుకుందని సమాచారం. సినిమా మొత్తం 3 గంటల 6 నిమిషాల నిడివితో ఉంటుంది. బాలీవుడ్ బామ అలియా భట్, ఇంగ్లీషు బ్యూటీ ఒలీవియా కథానాయికలుగా ఉన్నారు. మరోవైపు బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, శ్రియా సరన్‌లు కీలకపాత్రల్లో కన్పించనున్నారు. థియేటర్ మరియు శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తంతో దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన 60 రోజుల తరువాత జీ5(Zee5), నెట్‌ఫ్లిక్స్‌లలో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది. భారీ బడ్జెట్ చిత్రం ఇంత త్వరగా ఓటీటీలో విడుదల కానుండటం ఇదే తొలిసారి.
Also read: Samantha on Divorce Issue: మళ్లీ మళ్లీ అదే అంశమా...నాకిష్టం లేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook