RRR Movie: 'ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాలోని 'నాటు నాటు'’ (Naatu Naatu Song) సాంగ్ వచ్చేసింది. రామ్​చరణ్, ఎన్టీఆర్..మాస్ స్టెప్పులతో అలరించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ...రామ్ చరణ్‌ (Ramcharan), ఎన్టీఆర్ (NTR) కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా సినిమా. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7 (RRR release date)న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. సినిమాలోని రెండో పాటైన ‘నాటు నాటు’ (లిరికల్‌ వీడియో)ను విడుదల చేసింది మూవీ యూనిట్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘నా పాట సూడు.. నా పాట సూడు.. వీర నాటు నాటు...’ అంటూ సాగే ఈ సాంగ్‌లో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ గీతానికి కీరవాణి స్వరాలు అందించగా, చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ ఆలపించారు. ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘దోస్తీ’కి విశేష స్పందన లభించింది.


Also read: Anasuya Bharadwaj: పుష్పలో అనసూయ లుక్ మామూలుగా లేదుగా..!


దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్​తో ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా సందడి చేయనున్నారు. ఆలియా భట్‌, శ్రియ, సముద్రఖని, ఒలివియా మోరిస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రలు పోషించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook