RRR Movie New Poster: సంక్రాంతి పండగ వేళ 'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ విడుదలైంది. సంక్రాంతి, భోగి పండగ శుభాకాంక్షలతో మేకర్స్ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ వింటేజ్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. భుజాలపై కర్రతో ఎన్టీఆర్... ముఖంపై చిరునవ్వుతో చెర్రీ... ఇద్దరినీ చూస్తుంటే... 'జోరుగా.. హుషారుగా..' అనే ఓల్డ్ సాంగ్ గుర్తురాక మానదేమో..! పండగ వేళ విడుదలైన ఈ పోస్టర్‌కు ఫ్యాన్స్‌ నుంచి మంచి స్పందన లభిస్తోంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అన్నీ అనుకూలిస్తే 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలై ఈపాటికి వారం రోజులు గడిచేది. జనవరి 7న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడక తప్పలేదు. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఇప్పటికైతే స్పష్టత లేదు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో 'త్వరలోనే కలుద్దాం..' అని ప్రకటించారు తప్పితే... రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వలేదు.  'ఎప్పుడు చూస్తామో ఆర్ఆర్ఆర్ సినిమాను థియేటర్‌లో...' అంటూ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తున్నారు.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రమవడంతో సినీ ఇండస్ట్రీపై అది ప్రభావం చూపిస్తోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో (RRR Movie) పాటు ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా కూడా వాయిదా పడింది. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలేవీ బరిలో లేకపోవడంతో చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి.


Also Read: Tadepalligudem: తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి! పండుగ పూట విషాదం!!


Also Read: Virat Kohli - DRS: కేవలం ప్రత్యర్థి పైనే కాదు.. మీ జట్టుపైనా దృష్టి పెట్టాలి! మరోసారి డీఆర్‌ఎస్‌ దుమారం!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook