RRR Movie update 4 years ago, this pic featuring Ram Charan, Rajamouli, Jr NTR sent fans into a tizzy:టాలీవుడ్‌లో ఇప్పుడు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న మూవీల్లో ఆర్ ఆర్ఆర్ (రౌద్రం రణం రుథిరం) ఒకటి. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీలో ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్‌లు (Ram Charan) కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు పోషిస్తోన్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ మూవీని జనవరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది మూవీ యూనిట్.


ఆర్ఆర్ఆర్ (RRR Movie) నుంచి తాజాగా ఒక అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ అనౌన్స్ అయ్యి సరిగ్గా ఈ రోజుతో నాలుగేళ్లు కంప్లీట్ చేసుకుందంటూ ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ తెలిపింది. స‌రిగ్గా నాలుగేళ్ల కింద‌ట 2017లో రాజమౌళి (Rajamouli) ఈ పిక్ పెట్టి ఎన్నో ఊహాగానాలకు నాంది పలికారు.



 


Also Read : మహారాష్ట్రలో 14 ఏళ్ల గిరిజన బాలిక పై అత్యాచారం.. నిందితుడు అరెస్టు


మూవీ ప్రారంభమై మూడు ఏళ్ళు పూర్తి చేసుకుందని.. ఇప్పుడు 50 రోజుల్లో ఈ సినిమా మ్యూజిక్ ని (Music) రిలీజ్ చెయ్యడానికి రెడీ చేస్తున్నాం అని మూవీ యూనిట్ పోస్ట్ చేసింది. ఇక ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాప్రపంచవ్యాప్తంగా దాదాపు 10000 స్క్రీన్లలో విడుదల అవుతుందని తెలుస్తోంది. 


Also Read : CM KCR Maha Dharna LIVE Updates: మహాధర్నా అనంతరం సీఎం కేసీఆర్‌ పాదయాత్ర..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook