రాజమౌళి ( Rajamoli ) తెరకెక్కిస్తున్న తాజా చిత్రం RRR. బాహుబలి ( Baahubali ) మూవీ తరువాత తెరకెక్కిస్తున్న చిత్రం కావడం.. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) నటించడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ALSO READ| Dry Cough:  ఈ మూడు చిట్కాలు పాటిస్తే పొడిదగ్గు ఇట్టే తగ్గిపోతుంది


దానికి తోడు RRR టీమ్ కూడా ఇవిగో ఆప్డేట్స్ ..అవిగో అప్డేట్స్ అని చెప్పి.. పండగ పోస్టులు పెట్టడంతో ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింట్ అయ్యారు. రకరకాలు మేమ్స్, ఫన్నీ వీడియోస్ తో సినిమా టీమ్ ను టీజ్ చేయడం ప్రారంభించారు. ఇవన్నీ గమనించి RRR టీమ్.. ఇక చాలు.. మేము అప్డేట్స్ ఇచ్చేస్తున్నాం అన్నట్టుగా ట్వీట్ చేసింది.


ట్వీట్ లో ఏముందంటే.. 


మా పండగ పోస్టులను చాలిస్తున్నాం.. మీ క్రియేటివిటీని అంతా వాడి అప్డేట్స్ కోసం మాపై దండయాత్ర చేశారు. మీ ప్రేమాభిమానాలకు ధన్యావాదాలు. ఇక మీరు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఇక మిమ్మల్ని అలరించడం మా పని...


రేపటి వరకు స్టే ట్యూన్డ్..
అని RRR టీమ్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది.



ALSO READ| Beauty Tips: కొరియా అమ్మాయిల బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా?



ఆ అప్డేట్ .. అదేనా ?
RRR చేసిన ట్వీట్ తో ఫ్యాన్స్ మరింత కన్ ఫ్యూజ్ అయ్యారు. ఆ అప్డేట్ ఏంటి..  సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేస్తారు అని ఒకరు.. లేదు రామ్ చరణ్ లుక్ విడుదల చేస్తారు అని ఇంకోకరు..కాదు కాదు తారక్ లుక్ రివీల్ చేస్తారు అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 


సోమవారం నాడు RRR షూటింగ్ మొదలైంది. కొమరం భీం పాత్ర చేస్తున్న తారక్ ( Jr.NTR ), హస్య నటుడు రాహుల్ రామకృష్ణపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారని సమాచారం. దీన్ని బట్టి మంగళవారం రోజు తారక్ లుక్ రివీల్ అయ్యే అవకాశం ఉంది అని కొందరు అంటున్నారు. మరి అసలు విషయం ఏంటో రేపటి వరకు ఆగితేనే తెలుస్తుంది. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు జీ హిందుస్తాన్. అప్డేట్ రాగానే మీకు సమాచారం అందిస్తాం. 



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR