/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

కొరియావాళ్లను ఎప్పుడైనా జాగ్రత్తగా చూశారా ? అమ్మాయిలైనా, అబ్బాయిలైనా.. వాళ్ల ముఖంలో ఒకరకమైన మెరుపు ( Glowing Skin ) ఉంటుంది. అందుకే కొరియా సీరియల్ స్టార్స్ ( Korean Stars ), పాప్ స్టార్స్, మోడల్స్ ను మన దేశం వాళ్లు కూడా విపరీతంగా ఇష్టపడుతుంటారు. ఈ రోజు వాళ్లు అంత అందంగా (Beautiful ) కనిపించడం వెనక అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.

మంచి నిద్ర ( Sound Sleep ) వల్ల శరీరానికి సరికొత్త శక్తి  లభించడమే కాదు. అందం కూడా పెరుగుతుంది. ఇది కొరియా  వాసులకు బాగా తెలుసు అందుకే వాళ్లు నిద్ర విషయంలో కాంప్రమైజ్ కారు. ఇలా  వారిలా స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్ ( Smart and Beautiful ) కనిపించాలంటే ఏం చేయాలో ఈ టిప్స్ చదివి తెలుసుకోండి.

 

ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే మంచి నీళ్లతో ముఖం ( Facewash ) శుభ్రపరుచుకోవాలి. కేవలం నీటితో మాత్రమే కడగాలి.. క్లెన్సర్లు వాడరాదు.

ఫేస్  వాష్ తరువాత టోనర్ ( Toner ) వినియోగించాలి. దీని కోసం కాటన్ ను లేదా మీ అరచేతులను వినియోగించాలి. ఇది మీ స్కిన్ లో ఉన్న పీహెచ్ స్థాయులను రక్షిస్తుంది. 

దాంతో పాటు ఎస్సెన్స్ సీరమ్ ( Essence Serum ) ను వాడాలి. ఇందులో టోనర్, మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది. దీన్ని అరచేతితో అప్లై చేయాలి కానీ వేళ్లు వాడకూడదు

మన చర్మానికి తగిన సీరంను ఎంచుకోవాలి. దీని వల్ల చర్మంపై ఉండే ముడతలు, డార్క్ సర్కిల్స్ ( Dark Circles ), డ్రైన్ స్కిన్  వంటి సమస్యలు తొలగిపోతాయి.

కంటి కింద భాగంలో మెరుపు కోసం ముఖానికి వాడే ఫేస్  క్రీమ్ ( Facecream ) లను కాకుండా ఐ క్రీమ్ వాడాలి. దీన్ని వేలి చివరిన తీసుకుని కంటి మొదలు నుంచి చివరి వరకు అప్లై చేయాలి. కంటికి టచ్ కాకుండా చూసుకోవాలి. 

మీ చర్మం ఎలాంటిదో తెలుసుకోని మాయిశ్చరైజర్ ( Moisturizer ) ను ఎంచుకోవాలి. ఎందుకంటే  చర్మం కాంతి వంతం ( Glowing Skin ) అవ్వడంతో మాయిశ్చరైజర్ ఉపయోగపడుతుంది. 

చివరిగా సన్  స్రీన్  లోషన్ ( Sunscreen Lotion ) ను అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది  యూవీ రేయ్స్ ( UV Rays  ) టాన్ నుంచి, ముడతల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

ఈ చిట్కాలు మీకు కాస్త కష్టంగా అనిపించవచ్చు. కానీ  గుర్తుంచుకోండి.. అందం ఊరికే రాదు. అందంగా ఉండాలి అనుకుంటే ఈ మాత్రం కష్టపడాలి కదా.

Section: 
English Title: 
Tips To Get Beautiful Skin Like A Korean
News Source: 
Home Title: 

Beauty Tips: కొరియా అమ్మాయిల బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా?

Beauty Tips: కొరియా అమ్మాయిల బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా?
Caption: 
File image of Go Soo Jung Photograph( Twitter )
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 
  • కొరియావాళ్లను ఎప్పుడైనా జాగ్రత్తగా చూశారా ? అమ్మాయిలైనా, అబ్బాయిలైనా.. వాళ్ల ముఖంలో ఒకరకమైన మెరుపు ( Glowing Skin ) ఉంటుంది.
  • అందుకే కొరియా సీరియల్ స్టార్స్ ( Korean Stars ), పాప్ స్టార్స్, మోడల్స్ ను మన దేశం వాళ్లు కూడా విపరీతంగా ఇష్టపడుతుంటారు.
  • ఈ రోజు వాళ్లు అంత అందంగా కనిపించడం వెనక అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.
Mobile Title: 
Beauty Tips: కొరియా అమ్మాయిల బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా?
Publish Later: 
No
Publish At: 
Saturday, September 5, 2020 - 15:51