Saakini Daakini 1st Look is out On the occasion of Regina Cassandra's Birthday : యువ డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ‌ (Sudheer Varma) దర్శకత్వలో తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం 'శాకిని డాకిని' (Saakini Daakini). యువ కథానాయికలు రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదా థామస్ (Nivetha Thomas) కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొరియ‌న్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను సురేష్ బాబు, గురు ఫిలింస్, క్రాస్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కిడ్నాప్ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో శాకిని డాకిని సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు మిక్కీ ఎంసీ క్లియ‌రీ మ్యూజిక్ అందిస్తున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేడు రెజీనా క‌సాండ్రా (Regina Cassandra) పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా 'శాకిని డాకిని' చిత్ర యూనిట్ ఆమెకు బర్త్ డే గిఫ్ట్ (Birthday Gift) ఇచ్చింది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రెజీనా, నివేదాలు ఆర్మీ డ్రెస్సుల్లో క‌నిపిస్తున్నారు. నివేదా చెంపపై ఎవరో గుద్దుతుండగా.. రెజీనా చెవిని మరొకరు పిండుతున్నారు. దాంతో ఈసినిమాలో ఇద్దరి అల్లరి బాగానే అంటుందని అర్ధమవుతోంది. ఇక సినిమాలో రెజీనా, నివేదాల పాత్ర‌లు చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉండబోతున్నాయ‌ని ఫ‌స్ట్ లుక్‌తో దర్శకుడు సుధీర్ వ‌ర్మ‌ చెప్పకనే చెప్పేశాడు. ప్రస్తుతం 'శాకిని డాకిని' ఫ‌స్ట్ లుక్‌ (Saakini Daakini 1st Look) నెట్టింట వైరల్ అయింది. 


Also Read: Man Saves Monkey Life: కోతి నోట్లో నోరు పెట్టి.. ఊది.. గుండెపై నొక్కి.. ప్రాణాలు కాపాడిన వ్యక్తి


ఎస్ఎంఎస్ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది రెజీనా క‌సాండ్రా (Regina Cassandra). ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనా.. వరుసగా అవకాశాలు దక్కించుకుంది. రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, రారా కృష్ణయ్య, పవర్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సౌఖ్యం, శౌర్య, ఎవరు, జ్యో అచ్యుతానంద, శంకర, నక్షత్రం, బాలకృష్ణుడు, అ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కొత్తజంట, జ్యో అచ్యుతానంద, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అ చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో కూడా నటించింది. 


Also Read: Rohit Sharma: కోహ్లీ కెప్టెన్సీ గురించి మొదటిసారి స్పందించిన రోహిత్.. ఇంతకీ ఏమన్నాడో తెలుసా?


ఆ మధ్య కెరీర్ పరంగా కాస్త వెనకబడిన రెజీనా క‌సాండ్రా (Regina Cassandra) ఇప్పుడు ఒక్కసారిగా వేగం పెంచింది. ఈ యేడాది ఇప్పటికే 'చక్ర'తో జనం ముందుకు వచ్చిన రెజీనా.. ఏకంగా ఐదారు సినిమాలతో బిజీగా ఉంది. ఇందులో థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, హారర్ లాంటి సినిమాలు ఉన్నాయి. నేనే నా, శాకిని డాకిని, ఫ్లాష్ బ్యాక్, బ్రేకింగ్ న్యూస్ వంటి తెలుగు సినిమాలతో పాటు బోర్డర్, పార్టీ వంటి తమిళ చిత్రాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'ఆచార్య' సినిమాలో కూడా రెజీనా ఐటమ్ సాంగ్ చేస్తోంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook