Rohit Sharma praises Virat Kohli's captaincy: టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్‌ శర్మ (Rohit Sharma) మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని 2019 వన్డే ప్రపంచకప్ నుంచి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పలు సందర్భాలలో ఈ విషయంపై ఇద్దరు స్పందించినా.. తాత్కాలికంగా మాత్రమే ఆ వార్తలకు పాలిస్టాప్ పడుతున్నాయి. ఇక టీ20 ప్రపంచకప్‌ 2021 ఓటమి తర్వాత ఈ చర్చ మరింత ఎక్కువైంది. ఆ విషయంలో కోహ్లీ, రోహిత్ ఎప్పుడూ స్పందించలేదు. అయితే ఇటీవల వన్డే కెప్టెన్‌గా కోహ్లీని తప్పించి.. రోహిత్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ (BCCI). దీంతో కెప్టెన్సీ మార్పు విషయంలో ఇద్దరి స్పందన ఏంటి అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలో తాజాగా కోహ్లీ కెప్టెన్సీ గురించి రోహిత్‌ స్పందించాడు. 

బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి రోహిత్ శర్మ మాట్లాడాడు. 'విరాట్‌ కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఐదేళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించిన కోహ్లీ.. ఎంతో అంకితభావంతో ఉండేవాడు. ప్రతి గేమ్‌ను గెలవాలనే పట్టుదల మరియు సంకల్పం అతడిలో ఉండేది. జట్టుకు కూడా అదే మాట చెప్పేవాడు. అందుకే టీమిండియా వరుసగా మంచి విజయాలు సాధించింది. జట్టుగా మేం వెనుదిరిగి చూసుకునే అవసరం లేకుండా కోహ్లీ చేశాడు' అని రోహిత్ అన్నాడు.

Also Read: Rashmika Mandanna: 'పుష్ప' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో.. ఆ విషయం తెలిశాక నేనెంతో బాధపడ్డాను: రష్మిక

'విరాట్‌ కోహ్లీ నేతృత్వంలో టీమిండియాకు ఆడటం చాలా గర్వంగా అనిపించేది. కోహ్లీతో ఆడేటప్పుడు ఆటను బాగా ఎంజాయ్‌ చేస్తాం. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. కోహ్లీ అందించిన స్ఫూర్తిని కొనసాగిస్తూ జట్టును ముందుకు నడిపిస్తాను. వచ్చే రోజుల్లో జట్టుగా మరింత మెరుగైన ఆటతీరు ప్రదర్శించాలి. దాని కోసం అందరం కలసి కష్టపడతాం. ప్రపంచకప్ రాబోతోంది. టైటిల్ అందుకోవాలంటే అనుసరించాల్సిన ప్రక్రియను ఇప్పటినుంచే అమలు చేయాల్సి ఉంటుంది. 2014 నుంచి మనం పెద్దగా తప్పు చేయలేదని నేను అనుకోను. టైటిల్ ఎందుకు సాదించట్లేదో తెలుసుకోవాలి' అనిన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. 

Also Read: Dil Raju: దిల్‌ రాజులో ఈ టాలెంట్ కూడా ఉందా.. వైరల్‌గా మారిన ఆ వీడియో...

నిజానికి టీ20 ప్రపంచకప్‌ 2021 తర్వాత విరాట్‌ కోహ్లీ (Virat Kohli) కేవలం టీ20 కెప్టెన్సీ నుంచి మాత్రమే తప్పుకొన్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియాకు ఇద్దరు కెప్టెన్లు ఉంటే బాగుండదని భావించిన బీసీసీఐ వన్డే కెప్టెన్సీని కూడా రోహిత్‌ శర్మ (Rohit Sharma)కు అప్పగించింది. తొలిసారి రోహిత్‌ నేతృత్వంలో భారత్ త్వరలో దక్షిణాఫ్రికా పర్యటకు వెళ్లనుంది. డిసెంబరు 26 నుంచి మూడు టెస్టుల సిరీస్‌, జనవరి 19 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ మొదలవుతాయి. రోహిత్ శర్మతో సహా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కి ఇదే తొలి విదేశీ పర్యటన. దీంతో ఈ సిరీస్‌ ఫలితంపై అందరిలో ఆసక్తి నెలకొంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

English Title: 
I Enjoyed Every Moment: Rohit Sharma praises Virat Kohli's captaincy
News Source: 
Home Title: 

కోహ్లీ కెప్టెన్సీ గురించి మొదటిసారి స్పందించిన రోహిత్.. ఇంతకీ ఏమన్నాడో తెలుసా?!!

Rohit Sharma: కోహ్లీ కెప్టెన్సీ గురించి మొదటిసారి స్పందించిన రోహిత్.. ఇంతకీ ఏమన్నాడో తెలుసా?
Caption: 
Rohit Sharma praises Virat Kohli's captaincy (Source: Twitter)
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Highlights: 

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి మొదటిసారి స్పందించిన రోహిత్

విరాట్‌ కెప్టెన్సీ గురించి రోహిత్‌ ఫస్ట్‌ కామెంట్‌

విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Mobile Title: 
కోహ్లీ కెప్టెన్సీ గురించి మొదటిసారి స్పందించిన రోహిత్.. ఇంతకీ ఏమన్నాడో తెలుసా?!!
Publish Later: 
No
Publish At: 
Monday, December 13, 2021 - 17:05
Request Count: 
102
Is Breaking News: 
No

Trending News