Pranayagodari Movie Success Meet: సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా.. పీఎల్ విఘ్నేష్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘ప్రణయ గోదారి’. పీఎల్‌వీ క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మించారు. ఈ నెల 13న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ సక్సెస్ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ విఘ్నేశ్ మాట్లాడుతూ.. చిన్న మూవీ అయినా.. ఆడియన్స్ పెద్ద హిట్ అందించారని అన్నారు. విజువల్స్, సాంగ్స్ ఇలా ప్రతీ దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.. కొత్త టీమ్ అయినా చాలా బాగా చేశారని మెచ్చుకుంటున్నారని చెప్పారు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హీరోయిన్ ప్రియాంక ప్రసాద్ మాట్లాడుతూ.. తమ సినిమాపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారని.. తన పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పారు. సాయి కుమార్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ మార్కండేయ మాట్లాడుతూ.. తమ ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తున్నారని.. తాను ఇచ్చిన సాంగ్స్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. మంచి హిట్ అందించిన ఆడియన్స్‌కు థ్యాంక్స్ చెప్పారు. యాక్టర్ సునీల్ రావినూతల మాట్లాడుతూ.. ప్రణయ గోదారి మూవీకి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వస్తోందని తెలిపారు. చాలా రోజుల తరువాత బ్యూటీఫుల్ లవ్ స్టోరీ చూశామని ఆడియన్స్ అంటున్నారని చెప్పారు. స్టోరీకి తగిన విజువల్స్ సాంగ్స్ ఉన్నాయని.. మార్కండేయ సాంగ్స్ బాగున్నాయని మెచ్చుకుంటున్నారని తెలిపారు. 


నటి ఉషా శ్రీ మాట్లాడుతూ.. తమ మూవీని ఆడియెన్స్ ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారని తెలిపారు. తనకు ఇంత మంచి క్యారెక్టర్‌ను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మూవీ ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కెమెరామెన్ ప్రసాద్ ఈదర మాట్లాడుతూ.. ఈ సినిమాకు కెమెరామెన్‌గా పనిచేసినందుకు ఆనందంగా ఉందన్నారు. మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. కొరియోగ్రాఫర్ కళాధర్ మాట్లాడుతూ.. ఈ మూవీలో పాటల పిక్చరైజేషన్ బాగుందని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారని.. చాలా సంతోషంగా ఉందన్నారు. నటీనటులు అందరూ ఎంతో బాగా యాక్ట్ చేశారని చెప్పారు. 


Also Read: Gold Rate Today: లక్కీ ఛాన్స్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధర.. సంక్రాంతి పండగ కంటే ముందే  కొనేయ్యండి   


Also Read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter