Gold Rate Today: లక్కీ ఛాన్స్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధర.. సంక్రాంతి పండగ కంటే ముందే కొనేయ్యండి

Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. నిన్న మొన్నటి వరకు దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతూ, తగ్గుతున్న బంగారం ధరలు నేడు డిసెంబర్ 16వ తేదీ సోమవారం కూడా భారీగానే తగ్గాయి. మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్స్ క్రమంగా తగ్గుతుండటంతో పసిడి ప్రియుల్లో ఆనందం నెలకుంటోంది. ఈ రోజు దేశవ్యాప్తంగా నమోదు అయిన బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 
 

1 /6

 Gold Rate Today: బంగారం ప్రియులకు అదిరిపోయే వార్త. కొంతకాలంగా పెరుగుతూ షాకిచ్చిన బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గు ముఖం పడుతున్నాయి. దీంతో బంగారం కొనేందుకు ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు. గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. నేడు సోమవారం కూడా బంగారం ధర తగ్గింది. దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 

2 /6

దేశంలోని అన్ని నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,000 దాటింది. ఆభరణాలు కొనుగోలు చేసే వారికి 22 క్యారెట్ల బంగారం ధర గురించి చెప్పాలంటే, దాని ధర రూ.71 వేలు దాటింది. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు పెరగనున్నాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

3 /6

ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 71,540గా ఉంది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 78,030గా నమోదు అయ్యింది.

4 /6

 కోల్‌కతాతో పాటు దేశంలోని ప్రధాన నగరాలైన  చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల  పది గ్రాముల గోల్డ్ రేట్  రూ. 71,390గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,880 పలుకుతోంది.   

5 /6

మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. గత రెండు రోజులుగా వెండి ధరలు రూ. 4100 వరకు తగ్గింది. హైదరాబాద్, కేరళ, చెన్నైలో కిలో వెండి ధర రూ. 99,900 ఉంది.

6 /6

 ఢిల్లీ, కోల్ కతా , బెంగళూరు, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ. 92,400 కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.