Virupaksha Pre Release Event సాయి ధరమ్ తేజ్‌కు జరిగిన బైక్ ప్రమాదం, హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు, కోమాలోకి వెళ్లాడంటూ తెలియడం, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినా కూడా సరిగ్గా మాటలు రాకపోవడం, మళ్లీ జన్మించినట్టు, కొత్తగా నడక, మాటలు నేర్చుకున్నట్టుగా జరగడం అందరికీ తెలిసిందే. అయితే విరూపాక్ష సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయి ధరమ్ తేజ్ ఇలా అన్నీ గుర్తు చేసుకున్నాడు. తనకు జరిగిన ప్రతీ విషయాన్ని స్టేజ్ మీద చెప్పాడు. తన అమ్మ, తన తమ్ముడు వైష్ణవ్ కోసం ఈ సినిమా చేశానని చెప్పుకొచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరూపాక్ష సినిమా సెట్‌లో మొదటి రోజు సాయి ధరమ్ తేజ్‌ని చూస్తే అందరూ ఏడ్చేసే వాళ్లని, ఎంతో చలాకీగా నవ్వించే సాయి ధరమ్ తేజ్.. ఒక్కో మాట మాట్లాడటానికి ఎంత కష్టపడ్డాడో తాము చూశామని సుకుమార్ నాటి విషయాన్ని స్టేజ్ మీద బయటపెట్టేశాడు. అలా సాయి ధరమ్ తేజ్ ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఇలా మళ్లీ తిరిగి వచ్చాడని గుర్తు చేశాడు.


సాయి ధరమ్ తేజ్ అయితే తనకు జరిగిన ప్రమాదం, వచ్చిన పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చాడు. మీకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలనే ఈ విషయాన్ని చెప్పానని, సింపతీ కోసం ఇదంతా చెప్పలేదని సాయి ధరమ్ తేజ్ తెలిపాడు. ఇక హెల్మెట్ వాడండని, పక్క వీధికి వెళ్లినా కూడా హెల్మెట్ పెట్టుకుని వెళ్లండని, హెల్మెట్ అంటే ఆ హెల్మెట్ కాదని, మీరంతా చాలా నాటీ అని నాకు తెలుసని, అందుకే హెల్మెట్ చూపిస్తున్నాను అని సాయి ధరమ్ తేజ్ నవ్వించాడు.


Also Read:  Prabhas Salaar : రెండు పార్టులుగా సలార్!.. సీక్రెట్ రివీల్ చేసిన విలన్ దేవరాజ్


ఇక విరూపాక్ష సినిమా అద్భుతంగా వచ్చిందని, కచ్చితంగా భయపడతారని, సినిమా టీం అంతా కలిసి ఎంతో ఇష్టంగా పని చేశామని, కుటుంబంలా కలిసి పోయామని టీం అంతా చెప్పుకొచ్చింది. ఇక ఈ చిత్రానికి విజువల్స్, ఆర్ఆర్, ఆర్ట్ వర్క్ ఎక్కువగా ప్లస్ అవుతుందని విరూపాక్ష టీం తెలిపింది. ఇప్పుడు అంతా కూడా టెక్నీషియన్ల గురించి మాట్లాడుతున్నారని, సినిమా విడుదలయ్యాక తన గురించి మాట్లాడతారని ఆశిస్తున్నానంటూ డైరెక్టర్ కార్తిక్ దండు చెప్పుకొచ్చాడు.


Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook