Sai Dharam Tej Wig సినిమాలో హీరోలు, హీరోయిన్లు పాత్రలకు తగ్గట్టుగా విగ్గులు ధరిస్తుంటారు. కొందరు నిజంగానే జుట్టును పెంచుకుంటారు. పాత్రకు తగ్గట్టు కావాల్సినట్టుగా మల్చుకుంటారు. అయితే సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా కోసం విగ్గు వాడాడట. ఈ విషయాన్ని స్టేజ్ మీదే చెప్పాడు. అందరికీ ఆ విగ్గుని కూడా చూపించాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ పనికి నెట్టింట్లో అంతా షాక్ అవుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. కరోనా సమయంలో రెండేళ్లు ఇంట్లోనే ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత బైక్ యాక్సిడెంట్ తరువాత హాస్పిటల్ బెడ్డుకు, ఇంటికే పరిమితమయ్యాడు. రిపబ్లిక్ సినిమా అయితే సాయి ధరమ్ తేజ్ బెడ్డు మీద ఉండగానే రిలీజ్ అయింది.


ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు ఇప్పుడు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. విరూపాక్ష టీజర్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది.


సాయి ధరమ్ తేజ్ లుక్ కాస్త డిఫరెంట్‌గా అనిపించింది. సాయి ధరమ్ తేజ్ లుక్, హెయిర్ స్టైల్‌ మీద అందరూ కామెంట్ చేశారు. అది విగ్ అని అన్నారు. అయితే దానిపై ట్రోలింగ్ కూడా జరిగింది. విగ్గా? కాదా? అన్నది చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చేసింది.


విరూపాక్ష సినిమాలోని పాత్రల పరిచయ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ ఈవెంట్లో సాయి ధరమ్ తేజ్ తన సాధారణ లుక్కుతో వచ్చాడు. అయితే సినిమా కోసం విగ్ వాడానని, స్టేజ్ మీద అందరికీ చూపించాడు. ఇప్పుడు ఇది పెట్టుకోలేదు అని అన్నాడు. మొత్తానికి సాయి ధరమ్ తేజ్‌ది ఈ సినిమాలో విగ్ అనేది అందరికీ తెలిసిపోయింది.


 Also Read:  Dasara Collection : దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్?.. నాని దెబ్బకు బాక్సాఫీస్ బద్దల్


Also Read: Janhvi Kapoor Pics : అందాలను ఒడిసిపట్టినట్టుగా.. కాక పుట్టించేలా జాన్వీ కపూర్ లుక్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook