కరోనావైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ విధించిన సమయంలోనే టాలీవుడ్ హీరోలు నితిన్, నిఖిల్ సిద్ధార్థ, రానా దగ్గుబాటి పెళ్లిళ్లు ( Tollywood celebrities marriages ) చేసుకున్న విషయం తెలిసిందే, ఇదే లాక్ డౌన్ సమయంలో మెగా ఫ్యామిలీలో కూడా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఎంగేజ్మెంట్ ( Niharika engagement ) కూడా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో జరగబోయే నిహారిక పెళ్లికి ( Niharika wedding ) ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, మెగా ఫ్యామిలీలో మరో హీరో పెళ్లి సందడి మొదలుకాబోతోంది. 'సోలో బ్రతుకే సో బెటర్' హీరో సాయిధరమ్ తేజ్ పెళ్లి ( Sai Dharam Tej to tie knot soon ) చేసుకోబోతున్నాడు. అవును, హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సుప్రీం హీరో పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకోబోతున్నాడంట. Also read : Bigg Boss 4 Tamil contestants list: బిగ్ బాస్ 4 తమిళ్ కంటెస్టంట్స్ జాబితా.. వీళ్లలో ఒక్కొక్కరి స్పెషాలిటీ ఇది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాయిధరమ్ తేజ్ కుటుంబం అతని కోసం ఒక అమ్మాయిని చూసిందని.. తన తల్లి నిర్ణయించిన అమ్మాయికే సాయి ధరమ్ తేజ్ ఓకే చెప్పాడని వార్తలొస్తున్నాయి. సాయిధరం తేజ్ ఆ సంబంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాతే, వాళ్ల అమ్మ తన సోదరుడు చిరంజీవికి ఆ సమాచారం ఇచ్చిందంట.. ఈ వార్త చిరుకి ఎంతో సంతోషాన్ని కలిగించిందని.. అలాగే చిరుకి కూడా ఆ సంబందం బాగా నచ్చిందని తెలుస్తోంది. అందరికీ అన్నీ నచ్చడంతో సాయి ధరమ్ తేజ్ వివాహ వేడుక వచ్చే వేసవిలో అంగరంగ వైభవంగా జరిపించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్.


సాయిధరం తేజ్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం‘సోలో బ్రతుకే సో బెటర్’ ( Solo brathuke so better ) సినిమాతో తేజూ బిజీగా ఉన్నాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో తేజూ సరసన నభా నటేష్ ( Actress Nabha Natesh ) జంటగా నటిస్తోంది. ఈ సినిమా మొదట్లో డిజిటల్ ప్లాట్‌ఫాంపై విడుదల కానుంది అని తెలిసింది, కాని ఇప్పుడు థియేటర్‌లకు అనుమతి లభించడంతో ఈ చిత్రం డైరెక్ట్ డిజిటల్ రిలీజ్‌కి వెళ్ళకపోవచ్చు అని టాక్. ఈ సినిమాని సుబ్బు డైరెక్ట్ చేయగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిన్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.  Also read : Sanjay Dutt Health Condition: సంజయ్ దత్ లేటెస్ట్ ఫొటో చూసి ఫ్యాన్స్ ఆందోళన!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe