Sai Pallavi New Movie శివ కార్తికేయన్ సినిమాలకు కోలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. రెమో సినిమాతో ఇక్కడ కూడా అభిమానుల సంపాదించుకున్నాడు శివ కార్తికేయన్. డబ్బింగ్ సినిమాల రూపంలో పలకరించిన శివ కార్తికేయన్.. రీసెంట్‌గా జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్‌తో ద్విభాషాచిత్రాన్ని చేశాడు. ప్రిన్స్ అంటూ శివ కార్తికేయన్ తమిళ, తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. కానీ శివ కార్తికేయన్ మాత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శివ కార్తికేయన్ ఇప్పుడు సాయి పల్లవి కలిసి ఓ సినిమాను చేయబోతోన్నారు. సాయి పల్లవి నటించిన విరాటపర్వం డిజాస్టర్ అవ్వడం, గార్గి సినిమాకు కలెక్షన్లు రాకపోవడంతే సాయి పల్లవి ఇక సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. తన డాక్టర్ వృత్తి మీద సాయి పల్లవి ఫోకస్ పెట్టిందని టాక్ వచ్చింది.


ఆ మధ్య న్యూఇయర్‌కు, పండుగలకు గుళ్లో కనిపించిన విజువల్స్ వైరల్ అయ్యాయి. అందరిలా సాధారణ యువతిలా కూర్చుని ధ్యానం చేస్తున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అయితే సాయి పల్లవి ఇక సినిమాలు చేయదేమో? అని అంతా అనుకుంటున్న సమయంలోనే ఇలాంటి అప్డేట్ ఇచ్చింది.


Also Read:  samyuktha hegde : బికినీలో తాటిచెట్టెక్కిన సంయుక్త..పిచ్చెక్కించిన 'కిరాక్' బ్యూటీ


తనకు కథ నచ్చి, తన పాత్ర బాగుంటే సినిమాలు చేస్తుందనే మెసెజ్‌ను సాయి పల్లవి ఇచ్చినట్టు అయింది. కమల్ హాసన్ బ్యానర్ మీద ఈ సినిమా రాబోతోంది. ఇందులో శివ కార్తికేయ, సాయి పల్లవి కలిసి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం నాడు గ్రాండ్‌గా జరిగాయి. వాటికి సంబంధించిన ఫోటోలు, సాయి పల్లవి స్టిల్స్ వైరల్ అయ్యాయి. ఎంతో పద్దతిగా కనిపిస్తోందంటూ సాయి పల్లవి అభిమానులు కామెంట్లు పెట్టారు.


Also Read:  Prabhas Hospitality : నిజంగానే రాజువయ్యా!.. ప్రభాస్ గొప్పదనం చెప్పిన రంగస్థలం మహేష్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook