Naga Chaitanya-Sai Pallavi: టాలీవుడ్ స్టార్ హీరో వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్న కథానాయకుడు.. అక్కినేని నాగచైతన్య. ప్రస్తుతం అతను తన కెరీర్లో మంచి హిట్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఎంతో కష్టపడి.. తండేల్ మూవీ కోసం కంప్లీట్ మేకోవర్ చేసుకున్నాడు. నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో.. తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

100 కోట్ల భారీ బడ్జెట్ తో..గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇప్పటివరకు చిత్రం నుంచి విడుదలైన టైటిల్, ఫస్ట్ పోస్టర్, టీజర్ మూవీ పై.. అంచనాలను బాగా పెంచాయి. చిత్రీకరణ చివర దశలో ఉన్న ఈ మూవీ.. ఈ సంవత్సరం క్రిస్మస్ కి విడుదల కావలసి ఉంది. అయితే అనుకోకుండా ఈ మూవీకి రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ తో క్లాస్ వచ్చేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అనుకున్న టైంకి ఈ చిత్రం విడుదల అవుతుందా.. లేక వాయిదా పడుతుందా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. 


ఇక మూవీ రిలీజ్ విషయం పక్కనపెడితే.. సినిమాకి సంబంధించిన పూర్తి స్టోరీని ముందుగానే నిర్మాత బన్నీ వ్యాస్ బయటపెట్టేశాడు. బన్నీ వ్యాస్ ప్రొడక్షన్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘ఆయ్’ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘తండేల్’ స్టోరీని వివరించాడు బన్నీ. ఇది ఒక అందమైన ప్రేమ కథ చిత్రం అని చెబుతూనే స్టోరీ మొత్తాన్ని బన్నీ వివరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఇదేమైనా కొత్త ప్రమోషన్ స్టంట్ ఏమో అని కూడా అందరూ భావిస్తున్నారు. 


ఇక స్టోరీ విషయానికి వస్తే ఇది యదార్ధంగా జరిగిన కథ. 21 జాలరులు మంది శ్రీకాకుళం, మచిలేశ్వరం నుంచి గుజరాత్ దగ్గర కాంట్రాక్ట్ వర్క్ చేయడానికి వెళ్తారు. అయితే ఒకరోజు అనుకోకుండా.. అక్కడ పనిచేస్తున్న వాళ్లు సమీపంలో ఉన్న పాకిస్తాన్ వాటర్స్ లోకి వెళ్లిపోతారు. దీంతో వాళ్లని పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంటుంది. అదే సమయానికి కాశ్మీర్ లో ఆర్టికల్ 371 రావడంతో.. మన దేశం మీద ఒక టెర్రర్ అటాక్ కూడా జరుగుతుంది. 


తీవ్ర ఉత్కంఠ పరిస్థితులను.. ఎదుర్కొంటూ వారు అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు అనే విషయంపై ఈ స్టోరీ ఉంటుందట. ఇక ఆ 21 మంది కోసం ఆడవారు చేసే ఫైట్.. ఈ మూవీలో హైలెట్ అని బన్నీ చెప్పుకొచ్చారు. ఈ మూవీ ఎంతో కొత్తగా అనిపించడంతోపాటు.. ప్రేక్షకులను మచిలేశ్వరం నుంచి కరాచీకి తీసుకు వెళ్తుందని బన్నీ అన్నారు. మొత్తానికి స్టోరీ చెప్పినట్లే చెప్పి కథపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ప్రొడ్యూసర్ తెగ ట్రై చేస్తున్నాడు అంటున్నారు నెటిజెన్లు.


Also Read: Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి సాగర్ కు కొనసాగుతున్న వరద.. సాగర్ గేట్లు ఓపెన్..


Also Read: Nagarjuna Sagar: సగం నిండిన నాగార్జున సాగర్.. 2 లక్షల పైగా వరద..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter