Sai Pallavi Sister Engagement Photos: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో నిజంగానే అందరి హృదయాలను ఫిదా చేసేసింది సాయి పల్లవి. ఆ తర్వాత ఈ హీరోయిన్ కి వరసగా ఛాన్సులు వచ్చిన తన పాత్ర ప్రాధాన్యత ఉన్న చిత్రాలు మాత్రమే ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకునింది. కోట్ల రూపాయలు ఇస్తామన్నా కానీ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ని తిరస్కరించి తన అభిమానుల దగ్గర మరింత గౌరవం దక్కించుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా గత సంవత్సరం విడుదలైన సాయి పల్లవి సినిమాలు మాత్రం పెద్దగా విజయం సాధించలేదు. విరాతపర్వం, గార్గి రొండు చిత్రాలు కూడా దిజాస్టర్ లగా మిగలగా ప్రస్తుతం ఈ హీరోయిన్ ఆశలు అన్ని రాబోతున్న నాగచైతన్య చిత్రం పైనే ఉన్నాయి. 


సినిమాల విషయం పక్కన పెడితే తాజాగా సాయి పల్లవి ఇంకా పెళ్లి బాజాలు మోగాయి. కొద్దిరోజుల క్రితమే సాయి పల్లవి చెల్లెలు పూజ తన ప్రేమించే అబ్బాయిని ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసింది. కాగా నిన్న పూజ ఎంగేజ్మెంట్ ఘనంగా నిర్వహించారు సాయి పల్లవి ఫ్యామిలీ మెంబర్స్. నిన్న కేవలం సాయి పల్లవి చెల్లెలు ఎంగేజ్మెంట్ లో డాన్స్ చేసిన వీడియో మాత్రమే బయటకి రాగా ఈ ఎంగేజ్మెంట్ పూర్తి ఫోటోలు ఎప్పుడొస్తాయి అని ఈ హీరోయిన్ అభిమానులు తెగ ఎదురు చూశారు. ఇక ఈరోజు ఈ ఎంగేజ్మెంట్ నుంచి ఫోటోలు బయటకి రావడంతో అందరూ వాటిని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.


 



ఈ ఫోటోల్లో ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కనిపించగా చెల్లి ఎంగేజ్మెంట్ వేడుకలో సాయి పల్లవి చీరలో మెరిసిపోతూ కనిపించింది. ఇక సాయి పల్లవి కన్నా ముందు తన చెల్లెలు పెళ్లి కావడంతో కామెంట్లలో అంతా కూడా సాయి పల్లవి పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి సాయి పల్లవి మదిలో ఎవరైనా ఉన్నారా? తను కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందా? అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాలి.



 


Also Read: One Man Five Women Preganant: వీడు మగాడ్రా బుజ్జి.. 22 ఏళ్లకే ఐదుగురు భార్యలు, ఒకేసారి తల్లులు కాబోతున్నారు


Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook