Sai Pallavi Sister Boyfriend: ప్రేమమ్ సినిమాతో మలయాళం లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాయి పల్లవి ఆ తరువాత ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి నిజంగానే ఫిదా చేసేసింది. సినిమాలతోనే కాదు తన సోషల్ మీడియాలో ఫోటోల ద్వారా కూడా అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది ఈ హీరోయిన్. ప్రస్తుత హీరోయిన్స్ కి భిన్నంగా ఎక్కువగా సాంప్రదాయ దుస్తులతో కనిపించి అలరిస్తూ ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాయి పల్లవి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమెకు ఒక చెల్లెలు ఉన్నారు. అచ్చం తనలాగే ఉందే తన చెల్లెలు పేరు పూజా కణ్ణన్. సోషల్ మీడియాలో తరచుగా అక్కాచెల్లెళ్ళు తమ ఇద్దరి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా సాయి పల్లవి ఎక్కువగా తన చెల్లెలితోనే కనిపిస్తూ ఉంటుంది. తమిళంలో ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన 'చిత్తిరి సేవనం' సినిమాలో పూజా కణ్ణన్ నటించారు. అందులో సముద్రఖని, రీమా కల్లింగళ్ తదితరులు నటించారు. అయితే ప్రస్తుతం పూజ తన బాయ్ ఫ్రెండ్ గురించి తెలియజేయడంతో తన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.


సాయి పల్లవి చెల్లెలు పూజ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. నిన్ననే ఈమె తన బాయ్ ఫ్రెండ్ ని అభిమానులకు పరిచయం చేసింది. నిస్వార్ధంగా ప్రేమించడం.. ప్రేమలో ఓపికగా ఉండడం ఇతనిని చూసే తెలుసుకున్నాను.. ఇతను వినీత్.. నిన్నటి వరకు నా క్రైమ్ పార్ట్నర్.. ఇకపై జీవిత భాగస్వామి' అంటూ వినీత్తో ఉన్న తన వీడియోని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేసింది.


ఈ వీడియో అలానే పూజ షేర్ చేసిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 


 



ఈ వీడియోలో వీరిద్దరూ కలిసి స్పెండ్ చేసిన ఎన్నో స్వీట్ మూమెంట్స్ ఉన్నాయి. వినీత్ వంట చేస్తూ.. కార్ డ్రైవ్ చేస్తూ.. పూజా కాళ్ళ గోర్లు తీస్తూ.. ఇలా తమ లైఫ్ లో జరిగిన ఎన్నో మధురమైన క్షణాలను ఒక వీడియోగా చేసి మరీ షేర్ చేసింది పూజ. కాగా వినీత్ గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.


Also Read: IND vs AFG 02nd T20I Live: కోహ్లీ రీఎంట్రీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్లు ఇవే..!


Also Read: Shaun Marsh: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన షాన్ మార్ష్.. షాక్‌లో ఆస్ట్రేలియా టీమ్..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter