Salaar Vs Dunki: ప్రభాస్ సలార్ పార్ట్ 1 సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా తగ్గేదే అని దూసుకుపోతోంది.  ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. ఐదేళ్ల నుంచి ఆకలితో ఉన్న రెబల్ అభిమానుల ఆకలిని తీర్చింది. ప్రభాస్ ని పక్కా మాస్ క్యారెక్టర్ లో చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ప్రభాస్ కట్ అవుట్ కి ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ తోడు అవ్వడంతో మూవీ లవర్స్ కూడా సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిత్రం హిందీలో మొదటి రోజు కన్నా రెండో రోజు కొంచెం ఎక్కువ సంపాదించడం విశేషం. రెండో రోజు సలార్ చిత్రం హిందీ బెల్తులో ఏకంగా 16 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం కానీ డంకీతో పోటీ పడకుండా ఉంటే.. హిందీలో మరిన్ని కలెక్షన్స్ సంపాదించి ఉంటుంది అని అంచనా. డంకీ తో పోటి ..పరిమిత థియేటర్స్ లో విడుదల నార్త్ పరిధిలో సలాడ్ సినిమాపై కొద్దిగా ప్రభావం చూపింది. అయినా కానీ అవన్నీ తట్టుకొని ప్రభాస్ సినిమా ఎక్కడ తగ్గకుండా..హిందీలో బెల్టులో కూడా సత్తా చాటింది. ఈ చిత్రం రెండు రోజుల్లోనే దాదాపు 31 కోట్ల నెట్‌ సంపాదించింది. కాగా మొదటి వారం ముగిసేసరికి బాలీవుడ్ లో ఈ చిత్రం దాదాపు 50 కోట్ల నెట్‌ని దాట వచ్చని అంచన.


మరోవైపు షారుఖ్ ఖాన్ డంకీ మూడవ రోజు దాదాపు 24-25 కోట్ల నెట్‌ను సంపాదించిన.. ఈ కలెక్షన్ షారుఖ్ ఖాన్ - హిరానీ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం రేంజ్ కలెక్షన్స్ కాదు అని భావిస్తున్నారు అందరూ. మరోపక్క సలార్ మాత్రం అస్సలు ఆ చిత్రంలో ఎటువంటి హిందీ నటులు లేకపోయినా అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అంతేకాకుండా డంకీ హిందీలో పర్వాలేదు అనిపించుకుంటూ ఉంటున్న.. మిగతా భాషల్లో మాత్రం డిజాస్టర్ కానుంది. ముఖ్యంగా తెలుగులో సలార్ పోటి తట్టుకోలేక రెండో రోజు నుంచి థియేటర్స్ నుంచి తప్పకుండి. ఇలా మన తెలుగు సినిమా హిందీ బెల్టులో…జోరు కొనసాగించగా.. అక్కడి హిందీ చిత్రం మన సౌత్ బెల్టులో మాత్రం చటికిలపడింది.


కాగ ప్రభాస్ కథ చిత్రాలు ఆది పురుష్.. రాదే శ్యామ్ రెండు కూడా డిజాస్టర్ లగా మిగలగా.. సలార్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. మరోపక్క షారుక్ ఖాన్ గత రెండు చిత్రాలు పఠాన్.. జవాన్.. సూపర్ హిట్ గా నిలిచినా కానీ దంకీ మాత్రం కలెక్షన్లు తెచ్చుకోలేక ఢీలా పడిపోతుంది.


Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు


Also read: Vitamin D: విటమిన్ డి ఎక్కువైతే ఏమౌతుంది, ఎలాంటి అనారోగ్య సమస్యలెదురౌతాయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook