Salman Khan Birth day: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27న 56వ పుట్టినరోజు (Salman khan 56 birthday) జరుపుకున్నారు. తన పన్వెల్ ఫామ్‌హౌస్‌లో కుటుంబ సభ్యుల, స్నేహితుల సమక్షంలో బర్త్ డే వేడుకలు చేసుకున్నారు సల్మాన్. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కత్రినా కైఫ్, రవీనా టాండన్, మాధురీ దీక్షిత్ తదితరులు సల్లూభాయ్ కి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నటి జెనీలియా (Genelia D'’Souza) తన ఇన్ స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ..సల్మాన్ కు బర్త్ విషెస్ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జెనీలియా పోస్ట్ చేస్తూ...''విశాల హృదయమున్న వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండేలా దేవుడు ఆశ్వీరదిస్తారు. ఈ రోజు భాయ్‌ పుట్టిన రోజు’’అని'' వీడియోకి కాప్షన్‌ ఇచ్చింది. ఆ వీడియోలో సల్మాన్‌తో కలిసి ఆమె అమెరికన్‌ చిత్రం ‘ఫూట్‌లూస్‌’లోని పాటకు స్టెప్పులేసింది. ఓ పార్టీలో వారిద్దరు ఒకే రకం దుస్తులు ధరించి చుట్టూ ఉన్నవారిని ఏ మాత్రం పట్టించుకోకుండా మ్యూజిక్‌కు అనుగుణంగా డాన్స్‌ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను 37లక్షలకుపైగా చూశారు. బొమ్మరిల్లు చిత్రంతో తెలుగు ప్రజలకు సుపరిచితమైన జెనీలియా..కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఈమె బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.





Also Read: Salman Khan Birthday: బాలీవుడ్ కండల వీరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు, సల్లూ భాయ్ అసలు పేరేంటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook