Vijay, Salman`s shoot postponed : ఇంటికి వచ్చేసిన లైగర్, టైగర్ మూవీల హీరోలు.. రెండు షూటింగ్‌లకు అదే సమస్య!!
Vijay devarakonda liger, Salman Khan Tiger 3 shoot postponed : కోవిడ్ వల్ల సల్మాన్‌ఖాన్, విజయ్ దేవరకొండ మూవీల షూటింగ్ వాయిదా. క్యాన్సిల్ అయిన లైగర్ మూవీ షూటింగ్. టైగర్ 3 మూవీ ఢిల్లీ షూటింగ్ కొత్త షెడ్యూల్ వాయిదా పడింది.
Salman Khan's Tiger 3 Vijay devarakonda's liger shoot postponed due to rise in COVID-19 cases : గత రెండేళ్లుగా రెండు వేవ్స్‌తో కోవిడ్ అల్లకల్లోలం సృష్టించింది. గత కొన్ని రోజులుగా పరిస్థితులు చక్కబడ్డాయి అనుకునే తరుణంలో ఇప్పుడు థర్డ్ వేవ్ మళ్లీ హడలెత్తిస్తోంది. రోజురోజుకు కోవిడ్ కేసులు (Covid cases) పెరిగిపోతున్నాయి. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీపై తీవ్రంగా పడింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయిన మూవీలు విడుదల తేదీలను పోస్ట్‌పోన్ చేసుకుంటున్నాయి. ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న మూవీలు షూటింగ్స్‌ను ఆపేసుకుంటున్నాయి.
కోవిడ్ వ్యాప్తి (Covid spread) వల్ల సల్మాన్‌ఖాన్, విజయ్ దేవరకొండ మూవీల షూటింగ్స్ ఆగిపోయాయి. కోవిడ్ విజృంభిస్తుండం వల్ల లైగర్ మూవీ (Liger Movie) షూటింగ్ క్యాన్సిల్ అయింది. కోవిడ్... మూవీ యూనిట్ మొత్తం ఇంటికి తిరిగొచ్చేలా చేసిందంటూ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో (Social media) ఒక పోస్ట్ చేశారు. ఇంట్లో తన పెంపుడు కుక్కతో సేద తీరుతున్న ఫోటోను పోస్ట్ చేశారు.
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ (Pan India Movie) లైగర్. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్. ఈ మూవీలో పాప్‌లర్ బాక్సర్ మైక్ టైసన్ (Mike Tyson) కీ రోల్ ప్లే చేశారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇక సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తోన్న మూవీ టైగర్ 3. (Tiger 3 Movie) మనీష్ శర్మ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ ఇప్పటికే టర్కీ, రష్యా, ముంబై తదితర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ ఢిల్లీలో (Delhi) ప్లాన్ చేశారు. హీరోహీరోయిన్లపై దాదాపు 15 రోజుల పాటు కీలక సన్నివేశాలను తెరకెక్కించాలనుకున్నారు. అయితే కోవిడ్ కేసులు (Covid cases) పెరుగుతుండడం వల్ల టైగర్ 3 మూవీ షూటింగ్ కూడా వాయిదా (postpone) పడింది.
Also Read : Oo Antava Song: యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఊ అంటావా.. ఊఊ అంటావా మావా సాంగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి