Samantha, Naga Chaitanya divorce latest updates: సమంత, నాగ చైతన్య జంట విడిపోతున్నట్టుగా చేసిన అధికారిక ప్రకటన వారి అభిమానులనే కాదు.. యావత్ సినీ పరిశ్రమను షాక్‌కి గురయ్యేలా చేసింది. ఎంతో మంది సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ విషయంలో వారికి మద్దతుగా నిలిచి ధైర్యం చెప్పగా.. ఇంకొంత మంది ఏదో ఒక సైడ్ తీసుకుని విమర్శలు గుప్పించారు. అసలు సమంత, నాగ చైతన్య ఎందుకు విడిపోవాల్సి వచ్చింది ? చైతూ, సమంతల విడాకుల నిర్ణయం వెనుక ఉన్న అంత బలమైన కారణం ఏంటంటూ ఎవరికి తోచిన రీతిలో వాళ్లు జోస్యం చెప్పుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవన్నీ ఇలా ఉంటే.. నాగ చైతన్య, సమంతల విడాకులపై అక్కినేని సన్నిహిత వర్గాలు చెప్పుకుంటున్న టాక్ ప్రకారం వాళ్లకు అధికారికంగా విడాకులు మంజూరు కావడానికి మరో మూడ్నాలుగు నెలల సమయం పట్టే వీలుందని తెలుస్తోంది. ఫిలింనగర్ టాక్ ప్రకారం ఇప్పటికే సమంత, చైతూ జంట విడాకుల (Samantha divorce) కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. అయితే, చట్ట ప్రకారం ఎవరైనా జంట ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన అనంతరం వారికి మూడు నెలల సమయం ఇచ్చి, మూడుసార్లు కౌన్సిలింగ్ చేసిన తర్వాతే కోర్టు తుది నిర్ణయం తీసుకుంటుంది. 


Also read : Pooja Hegde birthday poster from Radhe shyam: హ్యాపీ బర్త్ డే పూజ.. స్పెషల్ పోస్టర్ విడుదల చేసిన రాధేశ్యామ్


విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న జంట ఫ్యామిలీ కోర్టు కౌన్సిలింగ్‌లో (Family court councelling) మనసు మార్చుకున్నట్టయితే.. వారికి విడాకులతో పని లేకుండా తిరిగి కాపురం చేసుకునే వీలు ఉంటుంది. అప్పటికీ వాళ్లు మనసు మార్చుకోకపోతేనే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. చైతూ, సమంతల తీరు చూస్తే.. వాళ్లు తీసుకున్న నిర్ణయం పట్ల చాలా స్పష్టతతో ఉన్నట్టే అర్థమవుతోంది. 


ఈ లెక్క ప్రకారం చూస్తే.. చైతూ, సామ్ జంటకు వచ్చే ఏడాది జనవరిలో.. అంటే 2022 జనవరిలో అధికారికంగా విడాకులు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయని.. ఆ తర్వాత వారి నుంచి తమ డైవర్స్‌పై (Naga Chaitanya, Samantha divorce news) మరో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.


Also read : Bigg Boss 5: హైపర్ ఆది క్రేజ్ మామూలుగా లేదుగా..! 25 నిమిషాలకే షాకింగ్ రెమ్యూనరేషన్!


Also read : Neelima Shocking comments: సమంత గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన నీలిమ గుణ


Also read : Samantha Emotional Post: అబార్షన్, అఫైర్లపై స్పందించిన సమంత..ఎప్పటికలా చేయనంటూ పోస్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook